News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (24-09-2022)

Updated : 24 Sep 2022 13:00 IST
1/20
చెన్నై వేప్పేరిలోని ఓ పెట్‌ ఫుడ్‌ దుకాణంలో ఉంచిన సంచిపై ఉన్న పిల్లి బొమ్మలను నిజమైనవి అనుకొని వాటివంకే తదేకంగా చూస్తున్న పిల్లి. చెన్నై వేప్పేరిలోని ఓ పెట్‌ ఫుడ్‌ దుకాణంలో ఉంచిన సంచిపై ఉన్న పిల్లి బొమ్మలను నిజమైనవి అనుకొని వాటివంకే తదేకంగా చూస్తున్న పిల్లి.
2/20
ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం విద్యుత్తు కాంతుల్లో మెరిసిపోతున్న కనకదుర్గమ్మ ఆలయం ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబవుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం విద్యుత్తు కాంతుల్లో మెరిసిపోతున్న కనకదుర్గమ్మ ఆలయం
3/20
4/20
అనకాపల్లి జిల్లాలోని కశింకోటలో సినీనటి డాలీషా సందడి చేశారు. స్థానిక దుర్గమాంబ అమ్మవారి పండగను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఆమె విచ్చేశారు. స్థానిక సంతబయలు వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. అనకాపల్లి జిల్లాలోని కశింకోటలో సినీనటి డాలీషా సందడి చేశారు. స్థానిక దుర్గమాంబ అమ్మవారి పండగను పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఆమె విచ్చేశారు. స్థానిక సంతబయలు వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో తాను నటించిన సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.
5/20
సినీనటి కేథరిన్‌ ట్రెస నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో తళుక్కుమంది. పట్టణంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించింది. కేథరిన్‌ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలిరావటంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. సినీనటి కేథరిన్‌ ట్రెస నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో తళుక్కుమంది. పట్టణంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించింది. కేథరిన్‌ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలిరావటంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది.
6/20
అడవుల్లో తిండి దొరక్క గ్రామాల్లోని పంట పొలాలు, ఇళ్లపై దాడులు చేసే వానరాలు ఇప్పుడు పట్టణాల్లో గుంపులుగుంపులుగా సంచరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లపై వచ్చిపోయే వారి వద్ద చేతి సంచులను లాక్కుంటున్నాయి. ఇళ్లు, అపార్టుమెంట్లలోనూ చొరబడి చేతికందింది ఎత్తుకెళ్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కోర్టు ఆవరణలోనూ ఓ ఉద్యోగి ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం డబ్బాను సంచిలో ఉంచగా ఓ కోతి ఎత్తుకెళ్లి ఇలా తినేసింది. అడవుల్లో తిండి దొరక్క గ్రామాల్లోని పంట పొలాలు, ఇళ్లపై దాడులు చేసే వానరాలు ఇప్పుడు పట్టణాల్లో గుంపులుగుంపులుగా సంచరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లపై వచ్చిపోయే వారి వద్ద చేతి సంచులను లాక్కుంటున్నాయి. ఇళ్లు, అపార్టుమెంట్లలోనూ చొరబడి చేతికందింది ఎత్తుకెళ్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కోర్టు ఆవరణలోనూ ఓ ఉద్యోగి ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం డబ్బాను సంచిలో ఉంచగా ఓ కోతి ఎత్తుకెళ్లి ఇలా తినేసింది.
7/20
చుట్టూ పచ్చని పరిసరాలు.. మధ్యలో నుంచి దూసుకెళ్తున్న రైలు చూస్తే ఇదెక్కడో ఊటీ లేదా అరకు అనుకుంటే పొరపాటే. ఇది మన వరంగల్‌ నగరంలోనిదే. సికింద్రాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లే రైలు మార్గం. కాజీపేట మెట్టుగుట్ట పైనుంచి చూస్తే పచ్చదనంతో ఇలా ఆకట్టుకుంటుంది. చుట్టూ పచ్చని పరిసరాలు.. మధ్యలో నుంచి దూసుకెళ్తున్న రైలు చూస్తే ఇదెక్కడో ఊటీ లేదా అరకు అనుకుంటే పొరపాటే. ఇది మన వరంగల్‌ నగరంలోనిదే. సికింద్రాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లే రైలు మార్గం. కాజీపేట మెట్టుగుట్ట పైనుంచి చూస్తే పచ్చదనంతో ఇలా ఆకట్టుకుంటుంది.
8/20
ఆడబిడ్డలు సంబరంగా ఆడిపాడే పూలపండగ సమీస్తుండగా పల్లెల్లో బంతులు విరబూశాయి.. రహదారి పక్కనే ఉన్న పూల వనాలు కనువిందు చేస్తున్నాయి.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం ఎలకచెట్ల తండాలోని ఓ రైతు సాగు చేసిన బంతి తోట అందాలను శుక్రవారం ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది. ఆడబిడ్డలు సంబరంగా ఆడిపాడే పూలపండగ సమీస్తుండగా పల్లెల్లో బంతులు విరబూశాయి.. రహదారి పక్కనే ఉన్న పూల వనాలు కనువిందు చేస్తున్నాయి.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం ఎలకచెట్ల తండాలోని ఓ రైతు సాగు చేసిన బంతి తోట అందాలను శుక్రవారం ‘న్యూస్‌టుడే’ తన కెమెరాలో బంధించింది.
9/20
కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ పద్మనాభస్వామి ఆలయ ప్రధాన రాజగోపురంపై శుక్రవారం సాయం సంధ్య వేళ సూర్యబింబం చేసిన విన్యాసాలు అబ్బురపరచాయి. అస్తమయం అవుతున్న సూర్యుడు కొన్ని నిమిషాల తేడాలో రాజగోపురానికి చెందిన అయిదు అంతస్తుల గవాక్షాల నుంచి తన కిరణాలను ప్రసరిస్తూ కనువిందు చేశాడు. ఈ అపురూప ద్యశ్యాన్ని స్థానికులు, భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ పద్మనాభస్వామి ఆలయ ప్రధాన రాజగోపురంపై శుక్రవారం సాయం సంధ్య వేళ సూర్యబింబం చేసిన విన్యాసాలు అబ్బురపరచాయి. అస్తమయం అవుతున్న సూర్యుడు కొన్ని నిమిషాల తేడాలో రాజగోపురానికి చెందిన అయిదు అంతస్తుల గవాక్షాల నుంచి తన కిరణాలను ప్రసరిస్తూ కనువిందు చేశాడు. ఈ అపురూప ద్యశ్యాన్ని స్థానికులు, భక్తులు తన్మయత్వంతో వీక్షించారు.
10/20
11/20
హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ఆదివారమే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ను నెల రోజుల కిందటే ఖరారు చేసినా స్టేడియంలో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నాయి. ప్రేక్షకులు కూర్చొనేందుకు వీల్లేకుండా అక్కడక్కడ కుర్చీలు విరిగి పడిపోయాయి. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియంలో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఈ ఆదివారమే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ను నెల రోజుల కిందటే ఖరారు చేసినా స్టేడియంలో పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టున్నాయి. ప్రేక్షకులు కూర్చొనేందుకు వీల్లేకుండా అక్కడక్కడ కుర్చీలు విరిగి పడిపోయాయి.
12/20
ఈ హరితహార విభాగిని హైదరాబాద్‌ మధురానగర్‌ కాలనీలోనిది. కాలనీ ప్రధాన రహదారి మధ్యలోంచి వెళ్తున్న ఆరడుగుల ఓపెన్‌ నాలాపై కాంక్రీటు స్లాబ్‌ వేసిన మున్సిపల్‌ అధికారులు దానిపై బరువైన విభాగిని నిర్మించడం ప్రమాదకరమని అలాగే వదిలేశారు. దీంతో ఖాళీ రోడ్డు కార్ల అక్రమ పార్కింగ్‌కు అడ్డాగా మారింది. ఈ క్రమంలో ఇనుప విభాగిని నిర్మాణం చేసి ఇలా మొక్కల కుండీలను పెట్టారు. ఈ హరితహార విభాగిని హైదరాబాద్‌ మధురానగర్‌ కాలనీలోనిది. కాలనీ ప్రధాన రహదారి మధ్యలోంచి వెళ్తున్న ఆరడుగుల ఓపెన్‌ నాలాపై కాంక్రీటు స్లాబ్‌ వేసిన మున్సిపల్‌ అధికారులు దానిపై బరువైన విభాగిని నిర్మించడం ప్రమాదకరమని అలాగే వదిలేశారు. దీంతో ఖాళీ రోడ్డు కార్ల అక్రమ పార్కింగ్‌కు అడ్డాగా మారింది. ఈ క్రమంలో ఇనుప విభాగిని నిర్మాణం చేసి ఇలా మొక్కల కుండీలను పెట్టారు.
13/20
శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయంలో అమ్మవారి దీక్ష స్వీకరించారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ శుక్రవారం కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయంలో అమ్మవారి దీక్ష స్వీకరించారు.
14/20
భారీ వర్షాల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో పూర్తిగా నీట మునిగిన కార్లు. భారీ వర్షాల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో పూర్తిగా నీట మునిగిన కార్లు.
15/20
ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటీవల రోగులు పోటెత్తుతున్నారు. ఆ మేరకు అక్కడ మౌలిక వసతులు లేకపోవడం, సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిటకిటలాడుతున్న ఓపీలో చీటీ చేజిక్కించుకొని వైద్యుల వద్దకు వెళ్లేసరికే సమయం మించిపోతోంది. మరుసటి రోజు రావాల్సి వస్తోంది. శుక్రవారం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో నెలకొన్న రద్దీ ఇది. స్ట్రెచ్చర్లూ రోగుల సహాయకులే నెట్టుకెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు ఇటీవల రోగులు పోటెత్తుతున్నారు. ఆ మేరకు అక్కడ మౌలిక వసతులు లేకపోవడం, సిబ్బందిని నియమించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిటకిటలాడుతున్న ఓపీలో చీటీ చేజిక్కించుకొని వైద్యుల వద్దకు వెళ్లేసరికే సమయం మించిపోతోంది. మరుసటి రోజు రావాల్సి వస్తోంది. శుక్రవారం నిమ్స్‌ ఆసుపత్రి ఓపీలో నెలకొన్న రద్దీ ఇది. స్ట్రెచ్చర్లూ రోగుల సహాయకులే నెట్టుకెళ్లాల్సి వస్తోంది.
16/20
బాలానగర్‌-జీడిమెట్ల రోడ్డ్డులో బస్టాప్‌ నుంచి దారి పొడవునా డివైడర్‌పై ఉన్న వీధిదీపాలు వెలగడం లేదు. చీకటి పడితే ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులూ ఇకనైనా స్పందిస్తారా? బాలానగర్‌-జీడిమెట్ల రోడ్డ్డులో బస్టాప్‌ నుంచి దారి పొడవునా డివైడర్‌పై ఉన్న వీధిదీపాలు వెలగడం లేదు. చీకటి పడితే ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులూ ఇకనైనా స్పందిస్తారా?
17/20
గగనంలో ఉండాల్సిన భారీ విమానం.. జాతీయ రహదారిపై సాగటమేంటి అనుకుంటున్నారా..? అది ఓ పాత లోహ విహంగం లెండి. సేవలు అందించడం మానేశాక హైదరాబాద్‌లో ఉన్న దాన్ని దిల్లీకి చెందిన ఓ వ్యాపారి రూ.కోటిన్నరకు కొన్నారు. విమాన పైభాగాన్ని ఓ పొడవాటి లారీలో, రెక్కలు, ఇతర భాగాలను మరో వాహనంలో తరలిస్తుండటం వాహనదారులను, చూపరులను ఆకట్టుకుంది. గగనంలో ఉండాల్సిన భారీ విమానం.. జాతీయ రహదారిపై సాగటమేంటి అనుకుంటున్నారా..? అది ఓ పాత లోహ విహంగం లెండి. సేవలు అందించడం మానేశాక హైదరాబాద్‌లో ఉన్న దాన్ని దిల్లీకి చెందిన ఓ వ్యాపారి రూ.కోటిన్నరకు కొన్నారు. విమాన పైభాగాన్ని ఓ పొడవాటి లారీలో, రెక్కలు, ఇతర భాగాలను మరో వాహనంలో తరలిస్తుండటం వాహనదారులను, చూపరులను ఆకట్టుకుంది.
18/20
పువ్వులనే దైవంగా భావించి కొలిచె బతుకమ్మ పండగకు విద్యాసంస్థలు వేదికలయ్యాయి. శుక్రవారం అబిడ్స్‌లోని స్లేట్‌ పాఠశాల, కోఠి మహిళా విశ్వవిద్యాలయాల్లో వేడుకలు జరిగాయి. విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి చుట్టూ చేరి గౌరమ్మను పూజిస్తూ ఆడిపాడారు. పువ్వులనే దైవంగా భావించి కొలిచె బతుకమ్మ పండగకు విద్యాసంస్థలు వేదికలయ్యాయి. శుక్రవారం అబిడ్స్‌లోని స్లేట్‌ పాఠశాల, కోఠి మహిళా విశ్వవిద్యాలయాల్లో వేడుకలు జరిగాయి. విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి చుట్టూ చేరి గౌరమ్మను పూజిస్తూ ఆడిపాడారు.
19/20
20/20

మరిన్ని