ఆహ్లాదకర రచన

పెళ్లికి ముందే కాబోయే భార్య స్వభావాన్నీ, ఆలోచనల తీరునూ తెలుసుకోవాలనే ఆసక్తి యువకులకు సహజం. ఈ కుతూహలం తీర్చుకోవడానికి కథానాయకుడు ఎవర్ని కలిసి ఏం చేశాడన్నది ఈ నవలిక ఇతివృత్తం. కళాశాల విద్యార్థినిగా ఉన్నపుడు

Updated : 30 Jul 2022 15:37 IST

ఆహ్లాదకర రచన

పెళ్లికి ముందే కాబోయే భార్య స్వభావాన్నీ, ఆలోచనల తీరునూ తెలుసుకోవాలనే ఆసక్తి యువకులకు సహజం. ఈ కుతూహలం తీర్చుకోవడానికి కథానాయకుడు ఎవర్ని కలిసి ఏం చేశాడన్నది ఈ నవలిక ఇతివృత్తం. కళాశాల విద్యార్థినిగా ఉన్నపుడు తాను హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌లో గమనించిన విశేషాలనూ, అనుభూతులనూ ఈ ఆహ్లాదకరమైన రచనగా తీర్చిదిద్దారు రచయిత్రి. 1999లో ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా వెలువడిన ఈ రచన యువతీయువకుల సున్నితమైన భావనలకు అద్దం పడుతుంది. యథాలాపంగా చేసే ప్రశంసలూ ఎదుటి వ్యక్తులపై వ్యాఖ్యలూ ఎంతటి ప్రభావం చూపుతాయో, అవతలి వ్యక్తి అల్లుకునే ఊహలకు ఎలా ఆధారమవుతాయో అందంగా చిత్రించారు. కథానాయిక కాంచనతో పాటు ఆమె స్నేహితురాళ్ల పాత్ర చిత్రణ ఆకట్టుకుంటుంది. పఠనీయతా, అర్థవంతమైన సంభాషణలూ, చక్కని శైలీ ఈ పుస్తకం ప్రత్యేకతలు.  

ఆమె నడిచే దారిలో
రచన: టి.శ్రీవల్లీరాధిక
పేజీలు: 50; వెల: రూ.150/-
ప్రతులకు: ఫోన్‌- 9441644644

- సీహెచ్‌. వేణు


విలువల కథలు

మకాలీన అంశాలను చర్చించే కథలివి. మానవీయ విలువల్ని వివిధ కోణాల్లో స్పృశిస్తాయి. పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని గర్వపడుతూ ‘ఇండియాలో ఏం ఉంది’ అనే మాధవరావుకి తాను కోల్పోయినదేమిటో చెప్పే కథ ‘దూర తీరాలు’.  పెద్దలే పిల్లల పాలిట ‘కాంతిదూతలు’ అని తెలుసుకున్న ఓ తండ్రి చేసిన మొదటి పని తన తండ్రిని తీసుకురావడానికి వృద్ధాశ్రమానికి బయల్దేరడం. చిన్నప్పటినుంచే పిల్లల్ని హాస్టళ్లలో పెట్టే తల్లిదండ్రులకు కనువిప్పు ‘పసిమనసులు’. సమస్యల్ని చర్చించడమే కాక ఆయా కథలకు రచయిత తనదైన ముగింపునీ సూచించడం విశేషం.

సుదూర తీరాలు (కథలు)
రచన: కటుకోజ్వల మనోహరాచారి
పేజీలు: 125; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9441023599

- పద్మ


బుద్ధుడి బోధనలు

హింసను మించిన ధర్మం లేదనీ, సర్వ ప్రాణులందూ దయకలిగి ఉండాలనీ చెప్పిన బుద్ధుడి కథలు జాతక కథలుగా పేరొందాయి. వాటిని ఆసక్తికరమైన నాటకాలుగా మలిచి ప్రచురించిన ఈ పుస్తకంలో 13 నాటకాలూ పదముగ్గురు వ్యక్తుల ప్రత్యేకతల్ని చాటుతాయి. మంచితనంతో శత్రువులో మానవత్వాన్ని మేల్కొలిపే దీర్ఘాయువూ, వాస్తు పిచ్చితో సంసారాన్ని నాశనం చేసుకునే ‘నందగోపుడు’, లోభత్వం తో చెడ్డవాడనిపించుకున్న ‘ఇల్లీసకుడు’... ఇలా ప్రతి పాత్రా మనిషిలోని ఒక్కో గుణాన్ని ప్రతిబింబిస్తుంది.

బౌద్ధ జాతక కథలు
రచన: యస్‌.డి.వి.అజీజ్‌
పేజీలు: 184; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌- 9133144138

- సుశీల


కామెడీ కథలు

నచుట్టూ కన్పించే సంఘటనలకే కాస్త వ్యంగ్యం జోడించి నవ్వించేలా రాశారు రచయిత. నాయుడు గారు రిటైరైతే వీడ్కోలు సభకి జనాలు దండిగా వచ్చి శాలువాల మీద శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పనికొచ్చే వస్తువు ఇవ్వలేదు. ఏకంగా నూటయాభై శాలువాలు ఉన్న ఆ మూటని వదిలించుకోవడానికి మర్నాటి నుంచీ నాయుడుగారు పడ్డ తిప్పలు ‘దుశ్శాలువా కప్పంగ’లో చూడొచ్చు. కారున్న ఇంట్లో పనిచేయడం అంటే పని మనిషికీ ఒక స్టేటస్‌ అంటుంది ‘శ్రీమంతుడు’ సినిమా కారు కథ. పేపరులో ప్రకటన ఇచ్చి మరీ ‘పనిమనిషి’ని నియమించుకున్న సాఫ్ట్‌వేర్‌ జంటకి చివరికి తామే కెలొరీలు కరిగించక తప్పలేదు.  

‘‘దుశ్శాలువా కప్పంగ’’
రచన: ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు
పేజీలు: 140; వెల: రూ.140/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

- శ్రీ


బుక్‌షెల్ఫ్‌

తాళ్లపాక సంకీర్తనలు

(పరిశోధనలో కొత్తగా వెలుగు చూస్తున్న తాళ్లపాక కవుల పదసాహిత్యం)
పేజీలు: 369; వెల: రూ. 120/-
ప్రతులకు: తితిదే పుస్తకకేంద్రాలు


శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్‌

శంకర భాష్యానుసారం: నేతి సూర్యనారాయణ శర్మ
పేజీలు: 218; వెల: రూ.200/-
ప్రతులకు: ఫోన్‌- 9247888887


ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం 1857

పేజీలు: 109; వెల: రూ. 100/-

ప్రముఖ విప్లవకారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌

పేజీలు: 112; వెల: రూ. 100/-
రచన: కోడూరి శ్రీరామమూర్తి
ప్రతులకు: ఫోన్‌- 9866115655


కోవిడ్‌... ఎయిడ్స్‌... నేను

రచన: డా.యనమదల మురళీకృష్ణ
పేజీలు: 164; వెల: రూ. 200/-
ప్రతులకు: ఫోన్‌పే నం.9491031492


కృష్ణపక్షం (సాహితీ వ్యాసాలు)

రచన: కృష్ణుడు
పేజీలు: 208; వెల: రూ.100/-
ప్రతులకు: ఎమెస్కో బుక్స్‌


అయూబ్‌ ఖవార్‌ కవిత్వం

స్వరసమ్మేళనం
పేజీలు: 120; వెల: రూ.200/-

లాటిన్‌ అమెరికన్‌ కవిత్వం

పేజీలు: 124; వెల: రూ.200/-
స్వేచ్ఛానువాదం: డాక్టర్‌ లంకా శివరామప్రసాద్‌
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తకకేంద్రాలు

ఆశల ఆమని (కవిత్వం)

రచన: సావిత్రి రంజోల్కర్‌
పేజీలు: 72; వెల: రూ.100/-
ప్రతులకు: ఫోన్‌- 9833497812


ఈ వేళప్పుడు (కవిత్వం)

రచన: అరసవిల్లి కృష్ణ
పేజీలు: 176; వెల: రూ.120/-
ప్రతులకు: ఫోన్‌- 9247253884


భూమి రంగు మనుషులు (కవిత్వం)

రచన: కెక్యూబ్‌ వర్మ
పేజీలు: 128; వెల: రూ.100/-
ప్రతులకు: ఫోన్‌- 9493436277


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..