చెప్పులు పట్టుజారవిక!

చాలామంది ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నప్పుడో, కాస్త వదులుగా ఉన్న చెప్పులూ, కొత్త బూట్లతో నడుస్తున్నప్పుడో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యల్ని తగ్గించుకోవాలంటే ‘హీల్‌ గ్రిప్స్‌, హై హీల్‌ ప్యాడ్స్‌’ని ప్రయత్నించి చూడొచ్చు.

Published : 03 Dec 2022 23:51 IST

చెప్పులు పట్టుజారవిక!

చాలామంది ఎత్తు మడమల చెప్పులు వేసుకున్నప్పుడో, కాస్త వదులుగా ఉన్న చెప్పులూ, కొత్త బూట్లతో నడుస్తున్నప్పుడో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమస్యల్ని తగ్గించుకోవాలంటే ‘హీల్‌ గ్రిప్స్‌, హై హీల్‌ ప్యాడ్స్‌’ని ప్రయత్నించి చూడొచ్చు. స్టిక్కర్లలా ఉండే వీటిలో చాలా రకాలే ఉంటాయి. వీటిల్లో, కొన్నేమో- వదులుగా ఉన్న చెప్పులు పట్టుజారకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. మరికొన్నేమో- చెప్పుల వల్ల గాయాల్లాంటివి కాకుండా చేస్తాయి. ఆడవాళ్లకూ, మగవాళ్లకూ ఉపయోగపడేలా, రకరకాల చెప్పులకు సరిపోయేలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి. మన అవసరాన్ని బట్టి ఎంచుకుని, మడమ దగ్గర చెప్పు లోపలికి వీటిని అతికించుకున్నామంటే హాయిగా నడిచేయొచ్చు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..