తీయతీయగా వెలుగుతాయి!

ఇక్కడున్న ఫొటోల్ని చూసి ‘అరె అటు మోతీచూర్‌ లడ్డుపైనా, జాంగ్రీ మీదా... ఇటైతే రసమలాయి పైనా అలా దీపాలు పెట్టారేంటీ’ అనుకుంటున్నారా... అయితే మీరు పప్పులో కాలేసినట్టే.

Published : 03 Dec 2022 23:53 IST

తీయతీయగా వెలుగుతాయి!

క్కడున్న ఫొటోల్ని చూసి ‘అరె అటు మోతీచూర్‌ లడ్డుపైనా, జాంగ్రీ మీదా... ఇటైతే రసమలాయి పైనా అలా దీపాలు పెట్టారేంటీ’ అనుకుంటున్నారా... అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇవన్నీ కూడా మిఠాయిలు కానేకావు, ఆ రూపంతో ఉన్న కొవ్వొత్తులు. ఇప్పటి వరకూ రకరకాల ఆకారాల్లో వచ్చిన క్యాండిల్స్‌... మన సంప్రదాయ స్వీట్లలానూ ఉంటే బాగుంటాయనుకున్నారేమో తయారీదారులు -  కొవ్వొత్తులకు ఇలా మిఠాయి రూపమిచ్చారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో అందుబాటులో ఉన్న ఈ స్వీట్‌ క్యాండిల్స్‌ను పండుగలప్పుడో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లోనో వెలిగించామంటే... అటు చూడ్డానికి మనకూ సరదాగానే ఉంటుంది, ఇటు వచ్చిన అతిథులూ కళ్లింతలు చేసుకుని ఆశ్చర్యపోతారు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..