ఈ పండ్లన్నీ తింటున్నారా?

చలికాలం రాగానే జామ, నారింజ, ఉసిరి, దానిమ్మ, బత్తాయి, ఆపిల్‌, కివీ, రేగు, కమలాలు... ఇలా ఎన్నో రకాల పండ్లు కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా సి-విటమిన్‌ సమృద్ధిగా ఉన్నవే.

Published : 27 Nov 2022 00:58 IST

ఈ పండ్లన్నీ తింటున్నారా?

చలికాలం రాగానే జామ, నారింజ, ఉసిరి, దానిమ్మ, బత్తాయి, ఆపిల్‌, కివీ, రేగు, కమలాలు... ఇలా ఎన్నో రకాల పండ్లు కనిపిస్తాయి. జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా సి-విటమిన్‌ సమృద్ధిగా ఉన్నవే. ఈ రెండింటికీ సంబంధం ఏమిటంటే- ఈ కాలంలో చర్మ సమస్యలతోపాటు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలూ తద్వారా కార్డియాక్‌ అరెస్ట్‌లతో మరణించే వాళ్ల సంఖ్యా పెరుగుతుంటుంది. జలుబూ జ్వరాలూ కూడా ఎక్కువగానే ఉంటాయి. వాటన్నింటినీ నివారించే గుణం సి-విటమిన్‌ ఎక్కువగా ఉండే ఈ పండ్లకు ఉంది. పుల్లని పండ్లన్నీ ఈ కాలంలోనే రావడానికి అదే కారణం కావచ్చు. సి-విటమిన్‌కు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయనీ అందుకే ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తోడ్పడుతుందని పరిశోధనలూ చెబుతున్నాయి. ఊపిరితిత్తులకు వచ్చే ఫైబ్రోసిస్‌, క్యాన్సర్లను నివారించే శక్తి సైతం విటమిన్‌-సికి ఉందట. ముఖ్యంగా కొవిడ్‌ అనంతరం అనేకమంది ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య శ్వాస సరిగ్గా అందకపోవడం. అందుకే చలికాలంలో సి-విటమిన్‌ను ఎంత తీసుకుంటే అంత మంచిది. వీటివల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. చర్మసమస్యలు తగ్గుతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. నారింజ, కమలాల్లోని పోషకాలన్నీ పొట్ట ఆరోగ్యానికీ తోడ్పడితే; జామకాయలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. దానిమ్మలోని పోషకాలు వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడతాయి. అలాగే స్ట్రాబెర్రీ, కివీ, ద్రాక్ష, ఉసిరి... అన్నింటినీ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల పేగులోని మలినాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ కాలంలో వచ్చే ఏ పండునీ వదలకుండా తినండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..