హహ్హహ్హ

రాజు: ఇప్పుడు నా జీతం ఎంత ఉంటుంది సర్‌... యజమాని: ప్రస్తుతానికి నెలకు ఇరవై వేల రూపాయలు. ఏడాది తర్వాత మరో పదివేలు పెంచుతా...

Updated : 11 Sep 2022 00:21 IST

హహ్హహ్హ

అయితే అప్పుడే వస్తా!

రాజు: ఇప్పుడు నా జీతం ఎంత ఉంటుంది సర్‌...

యజమాని: ప్రస్తుతానికి నెలకు ఇరవై వేల రూపాయలు. ఏడాది తర్వాత మరో పదివేలు పెంచుతా...

రాజు: అయితే అప్పుడే వస్తానండీ!


ఒక మందే చాలు!

రవి: డాక్టర్‌గారూ! మా ఆవిడకు గొంతు పూర్తిగా పోయి, మాట రావడం లేదు. గొంతు నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉందట...

డాక్టర్‌: ఈ రెండు మందులు వాడి రెండ్రోజుల తర్వాత రండి.

రవి: గొంతు నొప్పి తగ్గితే చాలు డాక్టర్‌గారూ... మొదటిదానికి మందు అక్కర్లేదండీ!


భర్తను సాధించు!

భక్తురాలు: ఎంత చదువు చదువుకున్నా... ఏమీ సాధించలేకపోతున్నా స్వామీ.

స్వామీజీ: అవునా తల్లీ, చక్కగా పెళ్లి చేసుకుంటే భర్తని సాధించొచ్చు కదా.


అలా అర్థమైందా...

భార్య: ఏంటండీ, ఈ టైమ్‌లో పౌడర్‌ రాసుకుని తల దువ్వుకుంటున్నారు...

భర్త: పక్కింటి ఆవిడకి తోడు కావాలట, నేను వెళ్తున్నా...

భార్య: నోరు ముయ్యండి, తోడు అడిగింది పెరుగు కోసం మిమ్మల్ని కాదు!


ఎప్పుడూ వినలేదే!

టీచర్‌: రామూ... గాంధీజీ కొడుకు పేరేంటి?

రాము: దినేశన్‌ టీచర్‌...

టీచర్‌: అదేంటి... నేనెప్పుడూ వినలేదు...!

రాము: నేను విన్నాను టీచర్‌, గాంధీజీని ఫాదర్‌ ఆఫ్‌ దినేశన్‌ అంటారుగా...

టీచర్‌: అరేయ్‌, అది ఫాదర్‌ ఆఫ్‌ దినేశన్‌ కాదు రా... ఫాదర్‌ ఆఫ్‌ ది నేషన్‌...


ఒలికిపోయిందేమో!

ర్షానికి రోడ్డుపైన స్కిడ్‌ అయి బైకు మీద నుంచి కిందపడిన భర్త భార్యకి ఫోన్‌ చేశాడు

భార్య: ఏంటండీ, ఇప్పుడే కదా ఇంటి నుంచి వెళ్లారు... మళ్లీ ఏం అవసరం వచ్చింది?

భర్త: నేను బండిపైనుంచి కింద పడ్డానే...

భార్య: అయ్యో అలానా... ఇవాళ బాక్సులో పప్పు చారు పెట్టాను. ఒలికిపోయిందేమో చూడండి.


ఖరీదైన రాయి మరి!

రాము కొత్తగా ఓ ఉంగరం పెట్టుకున్నాడు. అందరూ ఆ ఉంగరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘ఉంగరం బాగుంది కానీ అందులో ఉన్న రాయి ఏంటి అలా ఉంది’ అంటూ స్నేహితుడొకడు ఉండబట్టలేక అడిగాడు. ‘ఆ రాయి విలువ రెండు లక్షల రూపాయలు తెలుసా’ అన్నాడు రాము. ‘అవునా ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటి’ అడిగాడు స్నేహితుడు. ‘మొన్న రెండు లక్షలు పెట్టి ఆపరేషన్‌ చేయించుకుంటే నా కిడ్నీలోంచి తీసిన రాయి అది’ అంటూ గొప్పగా చెప్పాడు రాము!


పర్మిషన్‌ కాదు...

భార్య: ఏవండీ, చిక్కుడుకాయలు 2 కిలోలు, బఠాణీలు 2 కిలోలు తీసుకోనా?

భర్త: ఆఁ, తీసుకో.

భార్య: మీ బోడి పర్మిషన్‌ కోసం కాదు అడిగింది... 4 కిలోలు ఒకేసారి వొలవగలరా అని అడుగుతున్నా.


అందుకే వచ్చేశా!

లత: ఏమండీ... ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్లి వెంటనే తిరిగొచ్చారేంటీ?

వెంగళప్ప: పని మీద వెళ్తున్నప్పుడు ‘ఎక్కడికి’ అని అడగొద్దని చెప్పానా...

లత: నేను అడగలేదు కదండీ...

వెంగళప్ప: ఆటోవాడు అడిగాడు అందుకే వచ్చేశా!


ఇదీ మార్గమే

వెంకట్రావు: భార్యను లొంగదీసుకోవడానికి వెయ్యి మార్గాలు.. అనే పుస్తకం రాసిన నువ్వే.. మీ ఆవిడ కాళ్లు నొక్కుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నా...

సుబ్బారావు: నువ్వు ఆ పుస్తకాన్ని సరిగ్గా చదివావో లేదో... నేను రాసిన వెయ్యి మార్గాల్లో ఇది కూడా ఒకటి.


అదే తేడా!

కొడుకు: నాన్నా ప్రేమకీ, పెళ్లికీ తేడా ఏంటీ?

తండ్రి: ప్రేమ సైకిల్‌ ప్రయాణమైతే, పెళ్లి పడవ ప్రయాణం.

కొడుకు: అదెలా?

తండ్రి: ఇష్టం లేకపోతే సైకిల్‌ దిగిపోవచ్చు. పడవలోంచి మధ్యలో దిగడం కుదరదు కదా!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..