సరస్సులో విరిసిన పుష్పం

ఓ స్థాయి వరకూ చలి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. అది దాటితే మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పుడు చాలా దేశాల్ని చలి గజగజలాడించేస్తోంది.

Updated : 15 Jan 2023 03:17 IST

సరస్సులో విరిసిన పుష్పం

ఓ స్థాయి వరకూ చలి కూడా ఎంతో హాయిగా ఉంటుంది. అది దాటితే మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పుడు చాలా దేశాల్ని చలి గజగజలాడించేస్తోంది. ప్రమాదకరంగా మారిన ఆ చలి తీవ్రత నీటిని మంచు ముద్దలా గడ్డకట్టించేస్తుంది. అలా చలికోరల్లో గడ్డకట్టుకు పోయింది చైనాలోని సాంగ్హువా నది. దాంతో మంచు ముద్దలా మారిన నీరు ప్రకృతి చెక్కినట్టుగా ఓ అందమైన పూబాల అవతారమెత్తి కనువిందు చేస్తోంది. ఆ మంచుపువ్వుపైన లేలేత భానుడి కిరణాలు పడటంతో బంగారు వెలుగుల్ని విరజిమ్ముతూ ప్రకృతికే కొత్తందాలను తీసుకొచ్చింది. సరస్సులో విరిసిన ఆ మంచు పుష్పం పలువుర్ని ఆకట్టుకోవడంతో సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. అది కాస్తా వైరల్‌ కావడంతో మన వరకూ వచ్చి చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..