పాత వస్తువుల్ని... ఇంటికొచ్చి కొంటారు!
కొన్ని పాత వస్తువుల్ని చెత్తలో పడేయలేం, ఇంట్లోనూ దాచుకోలేం... అలాగనీ వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా అమ్మేద్దామంటే అందరికీ ఆ వీలు కుదరకపోవచ్చు...
పాత వస్తువుల్ని... ఇంటికొచ్చి కొంటారు!
కొన్ని పాత వస్తువుల్ని చెత్తలో పడేయలేం, ఇంట్లోనూ దాచుకోలేం... అలాగనీ వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా అమ్మేద్దామంటే అందరికీ ఆ వీలు కుదరకపోవచ్చు... చాలావరకూ ఆ పనిని అప్పుడూ ఇప్పుడూ అంటూ వాయిదా వేయడమే అవుతుంటుంది... ఎంతోమంది ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందిని ఇప్పుడు ఇట్టే తీర్చేస్తున్నాయి కొన్ని సంస్థలు... నేరుగా ఇంటికొచ్చి మరీ పాత పేపర్ల దగ్గర్నుంచి పనికిరాని ఫర్నిచర్ వరకూ అన్నింటినీ కొనుక్కుని వెళుతున్నాయి!
ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలే ఎక్కువ. అందులోనూ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లే బిజీ జీవితాలే. ఇంట్లోకి కావాల్సిన సామగ్రి నుంచి పిల్లల చదువుల వరకూ బాధ్యత అంతా కూడా ఆ ఇద్దరి మీదే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో సమయం సరిపోక, ఎలాంటి పనైనా చాలా సులువుగా, ఏ ఇబ్బందీ లేకుండా క్షణాల్లో అయిపోతే బాగుండనే చూస్తారు ఎవరైనా. ఆ విషయాన్ని దగ్గర్నుంచి గమనించిన వాళ్లెందరో ప్రతి పనినీ తేలిగ్గా చేసిపెట్టేలా సరికొత్త ఆలోచనలతో స్టార్టప్ కంపెనీల్ని సృష్టిస్తున్నారు. ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండానే నిమిషాల్లో ఇంటి పనులెన్నో అయ్యేలా రకరకాల సేవల్ని తీసుకొచ్చాయా కంపెనీలన్నీ కూడా.
ఫుడ్ మొదలు పూజ పూల దాకా అన్నిటినీ క్షణాల్లో ఇంటి ముందుకు తెచ్చిపెడుతున్నాయి. అచ్చంగా అదే దారిలో- ఇంట్లో ఉండే పనికిరాని వస్తువుల విషయంలోనూ ఒక చక్కని వెసులుబాటు ఉంది. మనం పక్కన పడేసిన ఎన్నో వస్తువుల్ని అమ్ముకోవడానికి- పాత వస్తువులు కొనే దుకాణాల దగ్గరకి మనం వెళ్లే అవసరం లేకుండా ఇంటి దగ్గరే అమ్మే సౌకర్యాన్ని తీసుకొచ్చాయి కొన్ని కంపెనీలు.
‘స్క్రాప్‌క్యూ, క్రాప్‌బిన్, స్క్రాపిట్, స్క్రాప్‌జోన్...’ ఇలా బోలెడన్ని ఆన్‌లైన్ కంపెనీలు వెబ్‌సైట్, ఆప్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటూ పలు నగరాల్లోనూ ఇలాంటి ‘ఆన్‌లైన్ స్క్రాప్ కలెక్టింగ్ కంపెనీ’లు చాలానే ఉన్నాయి. వీటిల్లో పక్కన ఉంచేసిన పేపర్లూ, ప్లాస్టిక్ బాటిళ్లూ, స్టీలు గిన్నెలూ, ఇత్తడి సామానూ, ఇనుప రాడ్లూ, అల్యూమినియం పాత్రలూ, టైర్లూ, వైర్లూ, పాత బట్టలూ, ఫర్నిచరూ, ఎలక్ట్రానిక్ వస్తువులూ, పాడైపోయిన రిఫ్రిజరేటర్లూ, వాషింగ్ మెషిన్లూ, గీజర్లూ... ఇలా అదీ ఇదీ అని కాదు, పనికిరాని వస్తువు ఏదైనా అమ్మేయొచ్చు. ఇష్టమైతే ఉచితంగానూ ఇవ్వొచ్చు. మనం వాటి వెబ్‌సైట్లోకి వెళ్లి అక్కడున్న వివరాల ఆధారంగా మన వీలు చూసుకుని బుక్ చేసుకున్నామంటే చాలు. సమయానికి వాళ్లే ఇంటికొస్తారు. మన కళ్ల ముందే ఆయా వస్తువుల బరువును కొలిచి వెబ్‌సైట్‌లో ఉంచిన ధరల ప్రకారం మనకు డబ్బు చెల్లించేస్తారు. ప్రతి ఇంట్లోనూ ఎంతో కొంత కచ్చితంగా పనికిరాని సామానంటూ ఉండనే ఉంటుందిగా. అలాంటి వాటన్నింటినీ ఈ వెబ్‌సైట్ల ద్వారా ఎప్పటికప్పుడు అమ్మేసుకోవచ్చు. బయట దుకాణాలతో పోలిస్తే... ధరా, తూకమూ విషయాల్లోనూ మనం మోసపోకుండా జాగ్రత్తపడొచ్చు. అంతేకాదు... ఇంట్లో కొత్త వస్తువుల్ని కొన్నప్పుడు చాలావరకూ పాత వాటిని పక్కన పెట్టేస్తుంటాం కదా. అలా స్టోర్ రూమ్‌లో నిండిపోయిన టీవీ, బీరువా, సోఫాల్లాంటి వస్తువుల్ని అమ్మడానికి బయటకు తీసుకెళ్లడమూ కాస్త ఇబ్బందే. ఆ శ్రమ లేకుండా ఈ వెబ్‌సైట్లలో మనకు కుదిరిన సమయంలో బుక్ చేసుకున్నామంటే ఎంచక్కా వాళ్లే ఇంటికొచ్చి తీసుకెళతారు. పైగా ధర గురించి అన్నీ ముందుగానే మాట్లాడి మనకు నచ్చితేనే అమ్మేయొచ్చు. ఈ ఆన్‌లైన్ స్క్రాప్ అమ్మకాల ద్వారా ఒకవైపు మనకూ ఎలాంటి ప్రయాస లేకుండా ఉంటుంది, మరోవైపు ఆ పనికిరాని వస్తువులన్నింటినీ రీసైక్లింగ్ చేయడం వల్ల భూమికి భారమూ తగ్గుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
Vikasraj: అక్టోబరులో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం: సీఈవో వికాస్ రాజ్
-
Gurpatwant Singh Pannun: పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ
-
politics: భాజపా - జేడీఎస్ పొత్తు.. ‘బెస్ట్ ఆఫ్ లక్’ అంటూ కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
-
Tamil Nadu: స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్ డోనర్స్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-
Chandramukhi2: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చంద్రముఖి-2’.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Jairam Ramesh: ‘కొత్త పార్లమెంట్ మోదీ మల్లీప్లెక్స్’.. జైరాం రమేశ్ విమర్శలకు భాజపా కౌంటర్