స్ట్రాబెర్రీలు... చాక్లెట్, వెనిలా రుచిలో
తినడానికే కాదు చూడ్డానికీ బాగుంటాయి స్ట్రాబెర్రీలు. ఎర్రెర్రగా మెరిసిపోయే రంగు... చక్కని ఆకృతిలో ఉండే ఈ స్ట్రాబెర్రీ- పులుపు, తీపి, వగరు కలగలిపిన రుచిలో ఉంటుంది.ఐస్‌క్రీమ్‌లూ, చాక్లెట్లూ, కేకులూ ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్లలో రావడం మనకు తెలిసిందే. మరి అలాంటి స్ట్రాబెర్రీ ఇప్పుడు రంగూ, రుచీ మార్చుకుని సరికొత్తగా వస్తోంది. ఎరుపుదనానికి బదులుగా స్ట్రాబెర్రీలు తెలుపు రంగులో వస్తున్నాయి. అమెరికా, ఇంగ్లండ్ మార్కెట్‌లలో ఇప్పుడు ఆ తెల్లని పళ్లు ఒక్కొక్కటి సుమారు ఎనిమిదొందలు పలుకుతున్నాయి. ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉండే స్ట్రాబెర్రీలను తెల్లగా ఎందుకు పండించకూడదూ అనుకున్నాడు జపానుకు చెందిన ఓ రైతు. కొన్నేళ్ల పాటు రకరకాల ప్రయోగాలు చేసి కొత్త విత్తనాలను సృష్టించాడు. ఆ రైతు చేసిన ప్రయోగం ఫలించి కొన్ని పూర్తి తెలుపు రంగులో పండితే మరికొన్ని వాటిపైన ఎరుపు లేదా గులాబీ రంగు డాట్స్‌తో వస్తున్నాయి. అలా రంగు ఒక్కటే మార్చితే ఏం బాగుంటుందని రుచిని కూడా మార్చేశాడు. చాలారకాల స్ట్రాబెర్రీలతో క్రాస్‌బ్రీడింగ్ చేసి చాక్లెట్, వెనిలా రుచిలో రెండు రకాల పంటల్ని పండిస్తున్నాడు. సాధారణ స్ట్రాబెర్రీల కన్నా ఇవి చాలా తీయగా క్యాండీ రుచితో ఉంటాయట. మార్కెట్‌లో ఎన్నో రకాల తెల్ల స్ట్రాబెర్రీలున్నా రుచిని మార్చుకున్న వాటికే మాంచి డిమాండు ఉందట.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి