విడిపోయారా... మేమున్నాం!

యుక్తవయసులో ప్రేమలూ, విడి పోవడాలూ చాలా సహజం. అయితే కొందరు ఆ బ్రేకప్‌ బాధను భరించలేక తీవ్ర మనోవేదనకు గురి అవుతుంటారు. న్యూజీలాండ్‌లో 16-24 ఏళ్ల లోపు వారు 87 శాతం మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారట.

Published : 02 Apr 2023 00:43 IST

విడిపోయారా... మేమున్నాం!

యుక్తవయసులో ప్రేమలూ, విడి పోవడాలూ చాలా సహజం. అయితే కొందరు ఆ బ్రేకప్‌ బాధను భరించలేక తీవ్ర మనోవేదనకు గురి అవుతుంటారు. న్యూజీలాండ్‌లో 16-24 ఏళ్ల లోపు వారు 87 శాతం మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారట. వారిలో కొందరు ప్రాణాలూ తీసుకుంటున్నారని తెలుసుకుంది అభివృద్ధి మంత్రిత్వ శాఖామంత్రి ప్రియాంక రాధాకృష్ణన్‌. యువత ఇలాంటి సమస్యలతో బాధపడటమంటే దేశభవిష్యత్తు ప్రమాదంలో పడినట్టేనని భావించిన ఆమె వారికోసం ‘లవ్‌ బెటర్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. క్యాబినెట్‌లోనూ ఆమోదముద్ర వేయించి అందుకోసం దాదాపు అరవై కోట్ల రూపాయల బడ్జెట్‌నూ ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా డిప్రెషన్‌లో ఉన్న యువతకు ప్రభుత్వమే రకరకాల కార్యక్రమాలతో వారికి మానసిక సాంత్వన అందిస్తుంది. నిపుణుల సమక్షంలో చికిత్సలు అందించడం, వారికి కావాల్సిన వాతావరణాన్ని సృష్టించడం వంటివెన్నో చేస్తారు. అందుకయ్యే ఖర్చునూ ప్రభుత్వమే భరిస్తుంది. యువతకోసం పెద్ద మనసుతో ఆలోచించిన మంత్రి ప్రియాంక స్వస్థలం చెన్నై.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..