పెళ్లికూతురు స్టాంపులు

పోస్టల్‌ స్టాంపులపైన మహనీయుల్నీ, స్ఫూర్తిదాతల్నీ, కట్టడాల్నీ, గౌరవ సంకేతాలనీ చూశాం. తాజాగా పోస్టల్‌ శాఖ పెళ్లికూతుళ్ల బొమ్మలతో ప్రత్యేక పోస్టల్‌ స్టాంపులను విడుదల చేసింది.

Updated : 21 May 2023 04:31 IST

పోస్టల్‌ స్టాంపులపైన మహనీయుల్నీ, స్ఫూర్తిదాతల్నీ, కట్టడాల్నీ, గౌరవ సంకేతాలనీ చూశాం. తాజాగా పోస్టల్‌ శాఖ పెళ్లికూతుళ్ల బొమ్మలతో ప్రత్యేక పోస్టల్‌ స్టాంపులను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల్లోని వివాహ సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయో యావత్‌దేశానికీ చాటి చెప్పాలనే ఉద్దేశంతో పోస్టల్‌ శాఖ ఆ నిర్ణయం తీసుకుంది. పెళ్లికూతురి కట్టూబొట్టూ, ఆభరణాలూ, ఇతర అలంకరణలతోపాటు- ఆ సంప్రదాయం ఏ రాష్ట్రానికి చెందినదో కూడా స్టాంపుపైన ముద్రించింది. అన్ని రాష్ట్రాల వధువుల చిత్రాలనూ ముద్రించడానికి సిద్ధమైన పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రస్తుతం పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, జమ్మూ కశ్మీర్‌, కేరళ తదితర తొమ్మిది రాష్ట్రాల స్టాంపులను మొదట విడుదల చేసింది. త్వరలో మిగతా రాష్ట్రాల సంప్రదాయాల్నీ వీటిపైన చూడొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..