Weekly horoscope: రాశిఫలం (జూన్‌ 18 - 24)

శుభకాలం. అన్నివిధాలా బాగుంటుంది. తలచిన కార్యాలు పూర్తవుతాయి. అదృష్టవంతు లవుతారు. ధైర్యంగా పనిచేసి పెద్దల్ని మెప్పించండి.

Updated : 18 Jun 2023 05:57 IST

గ్రహబలం ( జూన్‌ 18 - 24 )


శుభకాలం. అన్నివిధాలా బాగుంటుంది. తలచిన కార్యాలు పూర్తవుతాయి. అదృష్టవంతు లవుతారు. ధైర్యంగా పనిచేసి పెద్దల్ని మెప్పించండి. ఉద్యోగంలో అధికార యోగం సూచితం. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడులు అధిక లాభాన్నిస్తాయి. మహాలక్ష్మిని స్మరించండి, శుభవార్త వింటారు.


ధైర్యంగా, ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోండి. శుభఫలితాలుంటాయి. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పని అవుతుంది. లక్ష్యం నెరవేరే వరకూ పనిచేయాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. మాయమాటలతో మోసం చేసేవారుంటారు. ఆత్మీయుల సూచనలు అవసరం. విష్ణు సహస్ర నామం చదువుకోండి, మేలు జరుగుతుంది.


మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. సకాలంలో పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. సౌమ్యంగా మాట్లాడాలి. ఓర్పు అవసరం. మొహమాటంతో ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇంట్లోవారి సలహాలు తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. బుధగ్రహ శ్లోకం చదవండి, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది.


మంచి వ్యాపారయోగం ఉంది. పలువిధాలుగా లాభపడతారు. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. ఉద్యోగంలో ఉత్సాహంగా పనిచేయాలి. నిరాశ కలిగించేవారుంటారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి పనిచేయండి. కొన్ని ఆటంకాలు తొలగుతాయి. ఇతరులకు సలహాలు ఇవ్వవద్దు. స్పష్టంగా మాట్లాడండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరిస్తే మంచిది.


ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలున్నాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరండి. దైవాను గ్రహంతో ఒక ఆపదనుంచి బయటపడతారు. ఎదురుచూస్తున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. శాంతంగా వ్యవహరించండి. మానసిక స్థైర్యం కోల్పోవద్దు. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. పోయినవి తిరిగి లభిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, మేలు జరుగుతుంది.


శుభయోగాలున్నాయి. పనులు వెంటనే పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. స్థిరమైన భవిష్యత్తు లభిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో విశేష ధన లాభాలున్నాయి. భూ గృహ యోగాలున్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మహావిష్ణు స్మరణ శుభప్రదం.


ముఖ్యకార్యాల్లో అప్రమత్తత అవసరం. కాలం వ్యతిరేకంగా ఉంది. తెలియని విఘ్నాలు ఎదురవుతాయి. గత అనుభవంతో వ్యవహరించాలి. చంచలత్వం వల్ల పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. కలహసూచన ఉంది. ప్రతిపనీ ఇంట్లోవారితో చెప్పిచేయాలి. వ్యాపారంలో ఇబ్బందులను సమయస్ఫూర్తితో అధిగమించాలి. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది.


ఆర్థికంగా శుభఫలితాలుంటాయి. మిశ్రమకాలం. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. దేనికీ భయపడవద్దు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. వ్యాపారంలో కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. న్యాయబద్ధంగా వ్యవహరిస్తే ఆపదలు తొలగుతాయి. ఆంజనేయస్వామిని స్మరించండి, కార్యసిద్ధి లభిస్తుంది.


శ్రేష్ఠమైన కాలం. ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో అధిక ధన లాభాలు ఉంటాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. భూలాభం సూచితం. గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. పలుమార్గాల్లో పైకొస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. లక్ష్మీదేవిని స్మరించండి, శుభవార్త వింటారు.


ఉద్యోగంలో ఆశించిన ఫలితాలుంటాయి. ఏకాగ్రతతో పనిచేసి తగిన గుర్తింపు పొందుతారు. మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. వ్యాపారంలో ఆవేశం పనికిరాదు. ఇతరులపై ఆధారపడవద్దు. కుటుంబసభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. రామ నామాన్ని జపించండి, మంచి వార్త వింటారు.


సకాలంలో పనులు పూర్తిచేస్తే ఉద్యోగంలో సత్ఫలితాలుంటాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మిత్రుల వల్ల మంచి జరుగుతుంది. ఆశయం నెరవేరుతుంది. దేనికీ తొందరవద్దు. ప్రయత్నం బలంగా చేయండి. పనులు వాయిదా వేయవద్దు. రుణసమస్యలు పెరగకుండా జాగ్రత్తపడాలి. శుభవార్త వింటారు. శివారాధన శుభప్రదం.


ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. కాలం మిశ్రమంగా ఉంది. అధికారులతో శాంతంగా సంభాషించండి. అపార్థాలకు తావివ్వవద్దు. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. న్యాయబద్ధంగా పనిచేయండి. ఇంట్లోవారి సూచనలు తప్పనిసరి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు. బంధుమిత్రుల్ని కలుస్తారు. సూర్యనారాయణమూర్తిని దర్శించండి, ప్రశాంతత లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు