Updated : 27 Nov 2022 07:06 IST

Weekly Horoscope: గ్రహబలం (నవంబరు 27 - డిసెంబరు 3)


ధర్మబద్ధంగా బాధ్యతలను నిర్వర్తించండి. ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. విఘ్నాలున్నాయి. మొహమాటంతో సమస్యలు వస్తాయి. శ్రమకు గుర్తింపు లభించేలా కృషిచేయండి. సంఘర్షణాత్మకంగా అనిపిస్తుంది. స్పష్టతతో పనిచేస్తే లక్ష్యం సిద్ధిస్తుంది. శత్రుదోషం ఉంది. పెద్దల సూచనలు మేలుచేస్తాయి. నవగ్రహశ్లోకాలు చదివితే మంచిది.


సంతృప్తినిచ్చే ఫలితం ఉంది. ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలి. ఆటంకపరిచే పరిస్థితులున్నాయి. కాలం వృథా కాకుండా పని చేసుకోవాలి. చంచలత్వం వద్దు. ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది. వ్యాపారంలో సంశయం పనికిరాదు. ధర్మదేవత అనుగ్రహం లభిస్తుంది. నవగ్రహశ్లోక పఠనం శుభప్రదం.


ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. శ్రమ ఫలిస్తుంది. ఆశయం త్వరగా నెరవేరుతుంది. భూ గృహ వాహనాది యోగాలున్నాయి. ఆర్థికంగా వృద్ధి కనబడుతుంది. సకాలంలో తీసుకునే నిర్ణయం అధిక లాభాన్నిస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకునే సమయం. ధర్మనిష్ఠతో శాంతి లభిస్తుంది. లక్ష్మీ ఆరాధన శక్తినిస్తుంది.


మంచికాలం. అదృష్టయోగం ఉంది. అధికారుల ప్రశంసలుంటాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు బ్రహ్మాండమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆపదలు తొలగుతాయి. బాంధవ్యాలు బలపడతాయి. ఇష్టదేవతను దర్శించుకోండి, ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది.


అదృష్టయోగముంది, తగిన మానవ ప్రయత్నం చేయండి. విజయం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలసట చెందకుండా పనిచేసేలా ప్రణాళిక వేసుకోవాలి. వ్యాపారంలో అద్భుత ఫలితముంది.  వారం మధ్యలో సమస్య ఎదురవుతుంది. ఆత్మీయుల సూచనలు అవసరం. ఇష్టదేవతను స్మరించండి, కార్యసిద్ధి ఉంటుంది.


ఉద్యోగం బాగుంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. స్వల్ప ఆటంకాలున్నా అంతిమంగా విజయం మీదే. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి పనిచేయాలి. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోండి. ధనధాన్య లాభాలున్నాయి. కలహాలకు తావివ్వవద్దు. కుటుంబసభ్యులతో కలిసి పనిచేయండి. శివారాధన మంచిది.


వ్యాపారంలో విశేషలాభాలు ఉంటాయి. ప్రయత్నానికి రెట్టింపు ఫలితాన్ని పొందుతారు. సంకోచం పనికిరాదు. ఓర్పు చాలా అవసరం. దగ్గరివారితో ఆప్యాయంగా మాట్లాడండి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కాలాన్ని సద్విని యోగం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, ఆశయం నెరవేరుతుంది.


ఉద్యోగం అనుకూలం. సద్భావనతో పని ప్రారంభిస్తే త్వరగా విజయం లభిస్తుంది. కాలం అనుకూలిస్తుంది. ధర్మమార్గంలో ప్రయత్నం కొనసాగాలి. సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబానికి మేలు జరుగుతుంది. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఆవేశపరిచే వారున్నారు. పాత విషయాలు చర్చించవద్దు. విష్ణునామాన్ని స్మరించండి, మంచి జరుగుతుంది.


ధర్మం గెలిపిస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విజయం దగ్గరలోనే ఉంటుంది. కృషిని బట్టి గుర్తింపు లభిస్తుంది. ఆశించినది దక్కుతుంది. ఒత్తిడి ఉన్నా సమర్థతతో బాధ్యతలను పూర్తిచేయగలరు. ఒక సందేహం నివృత్తి అవుతుంది. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. సూర్య నారాయణమూర్తిని దర్శించండి, శుభవార్త వింటారు.


ఉద్యోగంలో సానుకూల ఫలితాలున్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. వ్యాపారంలో అభివృద్ధి లభిస్తుంది. చంచలస్వభావంతో కాలం వృథా కాకుండా చూసుకోవాలి. మంచి ఆలోచనలు చేయండి. పేరు ప్రతిష్ఠలుంటాయి. వారం మధ్యలో కలిసివస్తుంది. అదృష్టవంతులవుతారు. శివనామస్మరణ మంచిది.


ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంది. ధర్మమార్గంలో పయనించండి, కోరిక నెరవేరుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. సంకోచించకుండా స్పష్టమైన ఆలోచనతో లక్ష్యాన్ని చేరాలి. సాంకేతిక లోపాలు జరగనివ్వద్దు. ఊహకు అందని విషయాలు ఉన్నాయి. కుటుంబసభ్యుల సలహా అవసరం. పలువిధాలుగా అభివృద్ధి సూచితం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తే మేలు.తలచిన కార్యాలు సఫలమవుతాయి. మనోబలం, ఏకాగ్రతా అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఆపదలు తొలగుతాయి. వేధిస్తున్న సమస్యనుంచి బయటపడతారు. ముందూ వెనకా ఆలోచించి నూతన కార్యాలను  ప్రారంభించండి. పెద్దల సలహా అవసరం. ఆస్తి వృద్ధిచెందుతుంది. దానగుణం  చూపండి. సూర్యనమస్కారం శ్రేయస్కరం.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు