Weekly Horoscope: రాశిఫలం(ఫిబ్రవరి 13 - ఫిబ్రవరి 20)

అనుకూల కాలం. అదృష్టయోగముంది. ఉద్యోగంలో కీర్తి వస్తుంది. మిత్రులవల్ల శక్తి పెరుగుతుంది. కాదనుకున్న పనిని పూర్తిచేస్తారు. వారం మధ్యలో ఒక ఆపద వచ్చి పోతుంది.

Updated : 13 Feb 2022 06:24 IST

Weekly Horoscope: రాశిఫలం(ఫిబ్రవరి 13 - ఫిబ్రవరి 20)


అనుకూల కాలం. అదృష్టయోగముంది. ఉద్యోగంలో కీర్తి వస్తుంది. మిత్రులవల్ల శక్తి పెరుగుతుంది. కాదనుకున్న పనిని పూర్తిచేస్తారు. వారం మధ్యలో ఒక ఆపద వచ్చి పోతుంది. ఇంట్లోవారికి చెప్పి బయటకు వెళ్లాలి. శాంతంగా మాట్లాడాలి. రుణ సమస్యకు మార్గం గోచరిస్తుంది. వ్యాపారం అనుకూలం. ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది.

మనసుపెట్టి పని చేయండి. కార్యసిద్ధి ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. అధికారలాభముంది. తొందరలో పొరపాటు జరగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల నష్టం రానీయకండి. ఓర్పు తగ్గితే ప్రమాదం. ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించండి. విష్ణుమూర్తిని స్మరిస్తే మేలు.


మనోబలం రక్షిస్తుంది. కార్యసిద్ధికై ప్రయత్నించండి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎదుగుదలకు అవసరమైన ఆలోచనలు వస్తాయి. కొందరివల్ల శ్రమ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యవ్యక్తులతో సంప్రదింపులు అవసరం. వ్యాపారంలో కలిసివస్తుంది. సూర్యస్తుతి మంచిది.


ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల వల్ల ఇబ్బంది గోచరిస్తోంది. గ్రహబలం తక్కువగా ఉంది. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని పని పూర్తి చేయండి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. మౌనమే మేలు. వ్యాపారంలో స్వల్పలాభం ఉంటుంది. వారాంతంలో బాగుంటుంది. ఇష్టదేవతను ప్రార్థిస్తే మనశ్శాంతి లభిస్తుంది.


మంచికాలం. అదృష్టవంతులవుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగుంటుంది. అంతా మంచే జరుగుతుంది. నూతన ప్రయత్నాల్లో అభివృద్ధిని సాధిస్తారు. బంగారు భవిష్యత్తు ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం స్థిరత్వాన్నిస్తుంది. తోటివారిని కలుపుకుంటూ ముందుకుసాగాలి. ఇష్టదేవతారాధన మంచిది.


కార్యసిద్ధి ఉంది. స్వల్ప ఆటంకాలున్నా విజయం మీదే అవుతుంది. కాలం కలిసి వస్తుంది. ఆశించినది దక్కుతుంది. సంకల్పసిద్ధి విశేషంగా గోచరిస్తోంది. వేగవంతమైన నిర్ణయాలు లక్ష్యాన్ని చేరుస్తాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారబలం బాగుంది. గోవిందనామ స్మరణ చేయండి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.


అదృష్టయోగముంది. విజయం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. ఒత్తిడి పనికిరాదు. వ్యాపారబలం అద్భుతంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ధనయోగం బాగుంది. ధర్మమార్గంలో కీర్తి పెరుగుతుంది. వారం మధ్యలో కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మనశ్శాంతి ఉంటుంది.


ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. వ్యాపారలాభముంటుంది. శ్రమ పెరిగినా పట్టుదల ముందుకు నడిపిస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు అనుకూలం. గ్రహబలం స్వల్పంగా ఉన్నందున శాంతంగా వ్యవహరించాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. ఇష్టదైవారాధన శ్రేష్ఠం.


ఉత్తమ కాలం నడుస్తోంది. అన్నివిధాలుగా మేలు జరుగుతుంది. ఉద్యోగంలో గొప్ప ఫలితం లభిస్తుంది. మంచి భవిష్యత్తు గోచరిస్తోంది. వ్యాపారం బాగుంటుంది. ప్రారంభించిన ప్రతి పనీ కొత్త శక్తినిస్తుంది. సొంత పనులమీద దృష్టి పెట్టండి. మనోబలం స్థిరంగా ఉంటుంది. ఇష్టదైవస్మరణతో శుభం జరుగుతుంది.


బద్ధకించకుండా పని మొదలుపెట్టాలి. ప్రయత్నలోపం ఉండకూడదు. ఉద్యోగంలో చిన్న సమస్య ఎదురవుతుంది. కొత్త పని మొదలుపెట్టేటప్పుడు దగ్గరివారితో సంప్రదించండి, స్పష్టత వస్తుంది. లేదంటే పని మధ్యలో ఆగే ప్రమాదముంది. గృహ లాభముంటుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి, జీవితాశయం నెరవేరుతుంది.


ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచండి. ఉద్యోగంలో అనుకూల సమయం. పలుమార్గాల్లో అభివృద్ధి ఉంటుంది. ధైర్యంగా ఉండండి. దేనికీ తొందరవద్దు. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారున్నారు. సొంత నిర్ణయం మంచిది. ఆర్థికస్థితి మిశ్రమం. ఆధ్యాత్మిక మార్గంలో శక్తి లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. వారాంతంలో శుభం జరుగుతుంది. సూర్యస్తుతి మంచిది.


ఉద్యోగంలో విజయం ఉంది. అధికారులతో జాగ్రత్తగా సంభాషించండి. తగిన ప్రణాళికతో గందరగోళస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. వ్యాపారపరంగా శుభకాలం నడుస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆనందం కలిగించే విషయాలు ఉన్నాయి. సాహసకార్యాలు మేలు చేస్తాయి. చంద్ర ధ్యానం శుభప్రదం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..