Viral Video: భయపడిపోయిన చిరుత.. ఇద్దరిపై దాడి.. వీడియో వైరల్‌

జనావాసంలోకి వచ్చిన ఓ చిరుత ఇద్దరిపై దాడి చేసింది. స్థానికులు రాళ్లు రువ్వడంతో భయపడిపోయిన వన్యమృగం.. గందరగోళంలో ఈ దాడికి పాల్పడింది.

Published : 05 Nov 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జనావాసంలోకి వచ్చిన ఓ చిరుతపులిని చూసిన స్థానికులు దానిపై రాళ్లు రువ్వారు. దీంతో భయాందోళనకు గురైన ఆ చిరుత.. తప్పించుకోవాలనే గందరగోళంలో ఇద్దరిపై దాడి చేసింది. కర్ణాటకలోని మైసూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అటవీశాఖ (IFS) అధికారి సుసాంత నందా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది.

ఓ భవనంపై ఉన్న జనం రాళ్లు రువ్వడంతో భయపడిపోయిన చిరుత రోడ్డు వైపునకు పరిగెత్తి అటుగా వస్తున్న ఓ బైకర్‌ను ఢీకొట్టింది. దీంతో కిందపడిపోవడంతో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. ఓ రాయితో దాని వెనకే వెళ్లిన మరో వ్యక్తిపై చిరుత తిరబగడి గాయపర్చింది. 11 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోను సుసాంత నందా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఇప్పటికే ఆందోళనలో ఉన్న చిరుతను స్థానికులు మరింత గందరగోళానికి గురిచేశారు. వారికి కనిపించడమే అది చేసిన తప్పు. దాన్ని చూసిన వారు క్రూరంగా మారడంతో ఆ అడవి జంతువు రక్షణ కోసం పోరాడింది. అటవీశాఖ అధికారులు దాన్ని కాపాడారు’ అంటూ ట్వీట్ చేశారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని