Viral Video: కొట్టుకుపోతున్న బిడ్డను కాపాడుకున్న తల్లి ఏనుగు.. వైరల్‌ వీడియో

నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన బిడ్డను ఓ తల్లి ఏనుగు రక్షించి ఒడ్డుకు చేర్చిన వైనం చూపరులను కట్టిపడేస్తోంది.......

Published : 25 Jun 2022 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలపై తల్లులు చూపించే ప్రేమ అనిర్వచనీయం. జంతువులు సైతం తమ పిల్లలపై ఇలాంటి ప్రేమనే చూపుతాయి. సంతానాన్ని కాపాడుకునేందుకు ఎంతటి సాహసానికైనా పూనుకుంటాయి. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన బిడ్డను ఓ తల్లి ఏనుగు (elephant) రక్షించి ఒడ్డుకు చేర్చిన వైనం చూపరులను కట్టిపడేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్‌ (IFS) అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ ట్విటర్‌లో (Twitter) పంచుకోగా నెటిజన్లు  ప్రశంసిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని నగ్రకాటా ప్రాంతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని ఓ ఏనుగుల గుంపు ఎలాగోలా దాటింది. కానీ ఓ గున్న ఏనుగు మాత్రం ఆ భారీ ప్రవాహాన్ని దాటలేకపోయింది. తల్లి ఏనుగు వెనకాలే ఉండి సహకారం అందిస్తున్నా.. నీటి మధ్యలోకి వెళ్లిన గున్న ఏనుగు ఆ ప్రవాహ ధాటిని తట్టుకోలేకపోయింది. నీటిలో మునిగిపోతూ కొద్దిదూరం ప్రవాహంలో కొట్టుకుపోయింది. అయితే పట్టువదలని తల్లి ఏనుగు బిడ్డ వెనకాలే వెళ్లి.. తొండం, శరీరం సాయంతో బిడ్డను ఆపింది. ఆపై బిడ్డ వెనకాలే నిలుచొని ముందుకు సాగుతూ ప్రవాహాన్ని దాటించింది. ఐఎఫ్‌ఎస్‌ అధికారి పంచుకున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తల్లి ఏనుగుపై నెటిజన్లు అభినందనులు కురిపిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు