Andhra News: పోలీసులు వెంబడించడంతో.. జలాశయంలోకి గంజాయి వాహనం

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం వద్ద గంజాయి తరలిస్తున్న కారు జలాశయంలోకి దూసుకెళ్లింది.

Updated : 16 May 2022 10:26 IST

రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం వద్ద గంజాయి తరలిస్తున్న కారు జలాశయంలోకి దూసుకెళ్లింది. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నుంచి మైదాన ప్రాంతం రహదారిపైకి వస్తున్న గంజాయి తరలిస్తున్న వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంబడించారు. ఇది గమనించిన గంజాయి వాహన డ్రైవర్‌ వేగంగా నడిపాడు. ఈ క్రమంలో భూపతిపాలెం వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు అక్కడే ఉన్న జలాశయంలోకి దూసుకెళ్లింది.

కారులో ఉన్న ఒక వ్యక్తి పరారవ్వగా.. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రేన్‌ సాయంతో జలాశయంలో పడిన వాహనాన్ని బయటకు తీశారు. అందులోని 300కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని