Omicron: ఊపిరితిత్తులపై ఒమిక్రాన్ ప్రభావం తక్కువే!
ఒమిక్రాన్ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని, లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు స్పష్టం చేశారు.
బాధితులు 3-4 రోజుల్లోనే కోలుకుంటున్నారు
మార్చి చివరి నాటికి ఎండమిక్‌గా కరోనా రూపాంతరం
ఏఐజీ వెబినార్‌లో డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ఇతర వైద్యులు
ఈనాడు, హైదరాబాద్: ఒమిక్రాన్ రకం ఊపిరితిత్తులపై చాలా తక్కువ ప్రభావం చూపుతోందని, లక్షణాలు ఎగువ శ్వాసకోశ వ్యవస్థకే పరిమితం అవుతున్నాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యులు స్పష్టం చేశారు. చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయని పేర్కొన్నారు. 95 శాతం మంది 3-4 రోజులకే కోలుకుంటున్నారని, వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో భారీ స్థాయిలో జరిగిన ఉత్పరివర్తనాల వల్ల వ్యాప్తి అధికంగా ఉంటోందన్నారు. మూడో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ఒమిక్రాన్ లక్షణాలు.. చికిత్సలు తదితర విషయాలపై శుక్రవారం ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యం వెబినార్ నిర్వహించింది. ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మూడో దశల్లో ఆసుపత్రిలో చేరికలు, మరణాలు తక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో.. అంతే వేగంగా తగ్గిపోతోందన్నారు. మార్చి నెల అంతానికి ఎండమిక్ స్థాయికి చేరి, సాధారణ దగ్గు, జలుబు లక్షణాలకే పరిమితం కావొచ్చన్నారు. అయినా, నిర్లక్ష్యం వహించక అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బూస్టర్ డోసుతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి స్పైక్ ప్రొటీన్‌ను నియంత్రిస్తుందన్నారు. వైరస్ సోకినా స్వల్ప లక్షణాలే కన్పిస్తాయన్నారు.
ఆ లక్షణాలు ఉంటే డెల్టా రకమే
ఒమిక్రాన్‌లో సాధారణ జలుబు, పొడి దగ్గు, ముక్కు కారటం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం, గొంతు నొప్పి లాంటి లక్షణాలు కన్పిస్తున్నాయని డాక్టర్ శశికళ తెలిపారు. టీకా గ్రహీతల్లో టి-సెల్స్‌లోని వ్యాధి నిరోధకత కరోనా స్పైక్ ప్రోటీన్‌ను గుర్తించి అడ్డుకుంటోందన్నారు. తద్వారా చాలామంది రక్షణ పొందుతున్నారన్నారు. కొందరిలో 5 రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, వాసన, రుచి పోవడం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం అది డెల్టా వేరియంట్‌గానే భావించాలని డాక్టర్ కేతన్ తెలిపారు. మనిషి నుంచి కరోనా వైరస్ ఎలుకలు, ఒంటె, మేక తదితర జంతువులకు చేరి ఉత్పరివర్తనం చెంది తిరిగి మనుషులకు సోకడం వల్ల ఒమిక్రాన్‌లో ఎక్కువ మ్యుటేషన్లు ఉంటున్నాయని పాథాలజీ వైద్యులు డాక్టర్ అనురాధ శేఖరన్ వివరించారు. పల్మనాలజిస్టు డాక్టర్ విశ్వనాథ్ గెల్లా మాట్లాడుతూ తాజాగా అందుబాటులోకి వచ్చిన పలు యాంటీ వైరల్ ఔషధాలు అధిక రిస్క్ ఉన్న రోగుల్లో ఉత్తమ ఫలితాలే ఇస్తున్నాయన్నారు. రెండో డోసుల టీకాతోపాటు బూస్టర్ డోసు తీసుకొని ఉంటే.. యాంటీబాడీల పరీక్ష తర్వాతే కాక్టెయిల్ వినియోగంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పలువురు ఇతర వైద్యులూ మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్‌ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్‌షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్‌పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్‌పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్‌లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్‌బాబు ఆత్మకూరు ఛైర్‌పర్సన్‌గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?