విగ్రహం ఒక్కటే చాలదు..మత నిగ్రహమూ కావాలి...
ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ స్వాగతించారు. అయితే కేవలం విగ్రహం పెడితే సరిపోదని, నేతాజీ సిద్ధాంతాల్ని మనసా వాచా కర్మణా పాటించడమే
అదే నేతాజీకి ఇచ్చే నిజమైన నివాళి
‘ఈటీవీ భారత్’తో సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్
కోల్‌కతా: ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ స్వాగతించారు. అయితే కేవలం విగ్రహం పెడితే సరిపోదని, నేతాజీ సిద్ధాంతాల్ని మనసా వాచా కర్మణా పాటించడమే ఆయనకు నిజమైన నివాళి అని నొక్కిచెప్పారు. సర్వ మతాలను కలుపుకొనిపోయే సమ్మిళిత భావజాలాన్ని కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి అనుసరించాలని సూచించారు. సామాజిక సమభావన సూత్రాన్ని నేతాజీ జీవితాంతం అనుసరించారని, ఆ సిద్ధాంతాల బాటలో దేశాన్ని నడిపించాల్సిన గురుతర బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ‘ఈటీవీ భారత్’తో చంద్రకుమార్ బోస్ పేర్కొన్నారు. ‘‘మతాలను కలుపుకొనిపోయే ప్రక్రియను నేతాజీ నమ్మారు. ఆ సమ్మిళిత రాజకీయాల ఆధారంగానే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్, ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నడిపారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న విభజిత, మత రాజకీయాలకు వ్యతిరేకంగా మనమంతా పోరాడాలంటే నేతాజీని ఉదాహరణగా తీసుకోవాలి’’ అని చంద్రకుమార్ స్పష్టం చేశారు. మత ఆధారిత రాజకీయాలను నేతాజీ ఎన్నడూ నమ్మలేదని తెలిపారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ప్రముఖ కమాండర్ పేరు షా నవాజ్ ఖాన్ అని, జర్మనీ నుంచి నేతాజీ రహస్యంగా జలంతర్గామిలో జపాన్ ప్రయాణించిన సమయంలో ఆయనతో అబిద్ హసన్ అనే ముస్లిం వ్యక్తి ఉన్నారని గుర్తు చేశారు. మతాలు వేరైనా.. మనమంతా భారతీయులమన్న విషయాన్ని నేతాజీ దేశానికి చాటి చెప్పారని అన్నారు. ‘‘ఈ దిశగా యువతరానికి ముందుకు నడిపించకపోతే దేశంలో మరో విభజన అనివార్యం. ఈ సమ్మిళిత రాజకీయాలను ప్రధాని అనుసరించాలి. అదే నేతాజీకిచ్చే ఘన నివాళి’’ అని చెప్పారు. ‘‘విభజన, మత రాజకీయాలను ఆపకపోతే 1947లో ఏం జరిగిందో అదే మళ్లీ పునరావృతమవుతుంది. అప్పట్లో నేతాజీ భారత్ తిరిగి వచ్చి ఉంటే దేశం, బెంగాల్ విడిపోయి ఉండేవి కావు. దేశాన్ని సమైక్యంగా ఉంచాలంటే నేతాజీ భావజాలాన్ని పాటించటమొక్కటే మార్గం’’ అని చంద్రకుమార్ బోస్ సూచించారు. 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చంద్రకుమార్ బోస్ భాజపా అభ్యర్థిగా పోటీచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్‌ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్‌లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!