వైద్య బోధకుల బదిలీల దుమారం

ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్‌ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి.

Published : 07 May 2024 05:54 IST

ఉత్తర్వులిచ్చిన వెంటనే రిలీవ్‌ కావాలని ఆదేశాలు
ఇదెక్కడి అన్యాయమంటూ వైద్యుల ఆందోళన

ఈనాడు, అమరావతి: ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్‌ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. ఇందుకు అనుమతి కోరుతూ జాతీయ వైద్య కమిషన్‌కు ప్రభుత్వం గతేడాది దరఖాస్తు చేసింది. అయితే, ఎన్‌ఎంసీ కొత్త మార్గదర్శకాల ప్రకారం వైద్య బోధకుల నియామకాల్లో రాష్ట్రప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కొత్త కళాశాలలు ఏర్పాటు చేసినప్పుడు, కొత్త మార్గదర్శకాలు వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. అప్పట్లో పట్టించుకోలేదు. ఇప్పుడు హడావుడిగా ఈ కొత్త వైద్య కళాశాలలకు సుమారు 70 మంది వైద్య బోధకులను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మార్కాపురం కళాశాలకు ఒంగోలు, గుంటూరు, విజయవాడ నుంచి, పాడేరు కళాశాలకు విశాఖపట్నం నుంచి.. ఇలా బదిలీ చేసింది. ఉన్నపళంగా ఇలా బదిలీ చేయడం దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఎన్నికల సమయంలో ఇదేమి తీరంటూ వైద్యులు మండిపడుతున్నారు. తమకు మినహాయింపు ఇవ్వాలని కొందరు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు కొందరు పైరవీలతో అనుకూలమైన చోట పోస్టింగ్‌ పొందినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని