‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్‌లోడ్‌ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (సబ్కా) కోరింది.

Published : 07 May 2024 04:37 IST

ఈనాడు, అమరావతి: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్‌లోడ్‌ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (సబ్కా) కోరింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు విజయ్‌కుమార్‌.. గుంటూరు, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు కొండా రమేశ్‌ తదితరులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన సీఈవో.. అధికారులను వివరణ అడిగి తదుపరిచర్యలు తీసుకుంటానని హామీఇచ్చినట్లు సబ్కా నేతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని