వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం

‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు.

Published : 07 May 2024 05:55 IST

అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. వాషింగ్టన్‌లోని వర్జీనియాలో సోమవారం వీరు సమావేశమయ్యారు. ‘యువత భవిష్యత్తు బాగుండాలంటే కూటమి అధికారంలోకి రావాలి. విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. తెదేపా అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆయన ఆధ్వర్యంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళనగా ఉంది. రాష్ట్రాభివృద్ధికి మా వంతు కృషిగా స్వస్థలాలకు వెళ్లి ప్రజలు, బంధువులను చైతన్యపరుస్తాం. తెదేపా విజయానికి కృషి చేస్తాం’ అని తెలిపారు. కార్యక్రమంలో పాలడుగు సాయిసుధ, గోరంట్ల మంజూష, మన్నవ అనిత, పూసల సింధు, పారుపల్లి శాంతి, మండవ నీలిమ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని