ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా

రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్‌ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది.

Published : 07 May 2024 04:38 IST

పెట్టుబడి రాయితీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎన్నికల సంఘం ఆదేశం

ఈనాడు, అమరావతి: రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్‌ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలకు మార్చి 1న, రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల కోసం మార్చి 6న.. సీఎం జగన్‌ బటన్‌లు నొక్కారు. అయినప్పటికీ ఆ నిధుల్ని అప్పట్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయలేదు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన కొన్ని రోజుల తర్వాత ఆయా పథకాల కోసం నిధుల విడుదలకు అనుమతిని కోరుతూ ఎన్నికల సంఘానికి స్క్రీనింగ్‌ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలతో ఎన్నికల సంఘం విభేదించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిధుల విడుదలను వాయిదా వేసుకోవాలంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశాలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని