మూడేళ్లలో ఏం చేశారు?

‘ఎన్నికలప్పుడు మా ఊరొచ్చారు. మళ్లీ ఇప్పుడొచ్చారు. మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి?’ అంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ను పలువురు మహిళలు నిలదీశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో

Published : 16 May 2022 04:14 IST

నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్‌ను నిలదీసిన మహిళలు

గొలుగొండ, న్యూస్‌టుడే: ‘ఎన్నికలప్పుడు మా ఊరొచ్చారు. మళ్లీ ఇప్పుడొచ్చారు. మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఏంటి?’ అంటూ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ను పలువురు మహిళలు నిలదీశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేట పంచాయతీలో ఎమ్మెల్యే గణేష్‌ ఆదివారం పర్యటించారు. నాగాపురం శివారు పల్లాఊరుకు చెందిన మహిళలు ‘గ్రామంలో బడి లేదు. గుడి లేదు. అంగన్‌వాడీ కేంద్రంతోపాటు రోడ్లు లేవు. శ్మశానం లేదు. గత ఎన్నికల్లో మీకే ఓటేశాం. సంక్షేమ పథకాల్లోనూ అన్యాయం జరుగుతోంది. రకరకాల కారణాలు చూపుతూ కాపు నేస్తం నిలిపేశారు’ అంటూ గళమెత్తారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గణేష్‌ హామీ ఇవ్వడంతో శాంతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని