బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి

ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు.

Updated : 06 May 2024 06:23 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఆత్కూరు (గన్నవరం గ్రామీణం), న్యూస్‌టుడే: ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో కలిసి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ‘మనం ఓటు వేయడం, ఇతరులు వేసేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత. 60-70 శాతం ఓటింగ్‌తోనే సంతృప్తి చెందకూడదు. దానిని పెంచేందుకు అందరూ కృషి చేయాలి. ప్రలోభాలకు లొంగకుండా, ఉచితాలకు ఆశ పడకుండా నాయకుల సమర్థత చూసి ఓటు వేయాలి. బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలి’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకొని ఇతరులపై ఆధారపడకుండా జీవించినప్పుడే సంతృప్తి లభిస్తుందంటూ యువతీ యువకులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్‌ రామాచార్యులు, ట్రస్టు డైరెక్టర్‌ పరదేశి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు