ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!

వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది.

Published : 06 May 2024 06:21 IST

ఈనాడు, అమరావతి: వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. ప్రత్యేక రహదారులు నిర్మించి పైపులతో వంతెనలు కట్టి మరీ నదీ గర్భంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వి తరలిస్తోంది. జగనన్న ప్యాలెస్‌ ఉన్న తాడేపల్లికి కూతవేటు దూరంలో.. చిర్రావూరు పరిధిలోని కనిపించిన ఈ దృశ్యాన్ని చూడండి. దాదాపు పన్నెండు అడుగులు ఎత్తు ఉండే టిప్పరు కేవలం రెండు అడుగుల మేర మాత్రమే కనిపిస్తోందంటే ఇక్కడ ఎంత లోతులో తవ్వకాలు జరిపారో అర్థం చేసుకోవచ్చు. ప్రతూరు, చిర్రావూరు, రామచంద్రాపురం, వీరులపాలెం తదితర గ్రామాల పరిధిలో పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి నిత్యం వందల సంఖ్యలో లారీల కొద్దీ ఇసుక తరలిస్తున్నారు. మళ్లీ జగన్‌ ప్రభుత్వం వస్తుందో రాదో అన్న భయంతో సమీప గ్రామాల్లో గుట్టల కొద్దీ ఇసుక నిల్వలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని