సీపీఎస్‌ రద్దుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది

సీపీఎస్‌ రద్దు విషయంలో ఉపాధ్యాయుల్లో కొంత అసంతృప్తి ఉందని, దాని సంగతి పక్కనపెడితే టీచర్ల మిగతా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక

Published : 02 Jul 2022 05:17 IST

సీఎం అన్నారన్న మంత్రి మేరుగ

వేమూరు, న్యూస్‌టుడే: సీపీఎస్‌ రద్దు విషయంలో ఉపాధ్యాయుల్లో కొంత అసంతృప్తి ఉందని, దాని సంగతి పక్కనపెడితే టీచర్ల మిగతా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరులో శుక్రవారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో సీపీఎస్‌ రద్దుపై బాగా ఆలోచించారని, అది చేస్తే 2030-40 నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పారని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు