Andhra News: ఆటో డ్రైవర్లే చందాలు వేసుకొని గుంతలు పూడ్చారు..

రోడ్డు శిథిలావస్థకు చేరడంతో నిత్యం ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి ఆటో డ్రైవర్లు స్పందించారు. ఒక్కొక్కరు రూ.2 వేల చొప్పున చందాలు వేసుకొని గుంతలు

Updated : 24 Aug 2022 10:31 IST

గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు శిథిలావస్థకు చేరడంతో నిత్యం ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి ఆటో డ్రైవర్లు స్పందించారు. ఒక్కొక్కరు రూ.2 వేల చొప్పున చందాలు వేసుకొని గుంతలు పూడ్చటానికి ముందుకువచ్చారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో పీహెచ్‌సీ ఉండటంతో నిత్యం రోగులు రహదారిపై రాకపోకలకు పడుతున్న ఇబ్బందులను చూసి 30 మంది ఆటో డ్రైవర్లు స్పందించారు. చెట్నేపల్లి, యంగన్నపల్లి, బేతాపల్లి, ఊటకల్లు గ్రామాల పది కిలోమీటర్ల రహదారిలో ఏర్పడిన 300కు పైగా గుంతల్లో సుమారు 30 ట్రాక్టర్ల ఎర్రమట్టిని తోలించారు. ఆటో డ్రైవర్లే కూలీలుగా మారి గుంతలను పూడ్చారు.

రోడ్డుకు మరమ్మతు చేయించాలని చాలాసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వారు చెప్పారు. తమ ఆటోలు మరమ్మతుకు గురవుతూ ఉండటంతో వచ్చిన ఆదాయంలో సగం వాటికే పెట్టాల్సి వచ్చేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో ఇస్తున్న రూ.10 వేలు ఆటోల మరమ్మతులకు కూడా చాలటం లేదు. మా గ్రామానికి సరైన రహదారి నిర్మిస్తే చాలు’’ అని డ్రైవర్లు తెలిపారు. ఆటో డ్రైవర్లే స్వయంగా నిధులు జమ చేసుకుని రోడ్డు మరమ్మతు చేసుకున్న విషయంపై ‘ఈటీవీ’లో వచ్చిన కథనాన్ని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు