శ్రీవారి రథోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తులు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన రథోత్సవంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీషానంద దంపతులు, తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి వై.వీర్రాజు పాల్గొన్నారు.

Published : 05 Oct 2022 03:45 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం జరిగిన రథోత్సవంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.శ్రీషానంద దంపతులు, తిరుపతి మూడో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి వై.వీర్రాజు పాల్గొన్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న న్యాయమూర్తులకు తితిదే అధికారులు స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు.


విద్యుత్తు బస్సుల డిపోకు 3 ఎకరాలు

శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఈ పర్యాయం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి మూడు లక్షల మంది భక్తులకు గరుడసేవ దర్శనం చేయించామని తితిదే చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు తెలిపారు. తిరుమలలో విద్యుత్తు బస్‌ డిపో ఏర్పాటుకు బాలాజీనగర్‌లో మూడు ఎకరాలు కేటాయించామని చెప్పారు. తిరుమలకు వచ్చే ప్రైవేటు విద్యుత్తు వాహనాలకు నెడ్‌క్యాప్‌ సహకారంతో ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై చర్చిస్తున్నామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని