ఖనిజ దిగుమతులు తగ్గించుకోవడంపై దృష్టి

దేశంలో ఖనిజ అవసరాల కోసం దిగుమతులు చేసుకోవడాన్ని తగ్గించడంపై కేంద్రం దృష్టిపెట్టినట్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు.

Published : 03 Dec 2022 04:45 IST

బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి నాగరాజు

ఈనాడు, అమరావతి: దేశంలో ఖనిజ అవసరాల కోసం దిగుమతులు చేసుకోవడాన్ని తగ్గించడంపై కేంద్రం దృష్టిపెట్టినట్లు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మన దేశంలో లభించే అపార ఖనిజ నిక్షేపాలను వెలికితీయడానికి ప్రోత్సహిస్తోందన్నారు. శుక్రవారం విజయవాడలోని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కార్యాలయంలో గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. కేంద్రం అన్ని రాష్ట్రాల్లోని మైనింగ్‌ విధానాలను పర్యవేక్షిస్తోందని, కొత్త మైనింగ్‌ ఆపరేషన్స్‌ను ప్రారంభించేందుకు ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఏపీఎండీసీకి చెందిన మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లోని బొగ్గు గనులకు సంబంధించి కేంద్రం ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ఖనిజ తవ్వకాలు, రాష్ట్రంలో కొత్త మైనింగ్‌ విధానాలపై ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు