సలహాదారులు ఎందరున్నారో ప్రభుత్వానికే తెలియదు

రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో సలహాదారుల్ని ఎంత ఎడా పెడా నియమించిదంటే... ఎంత మంది సలహాదారులు ఉన్నారో ప్రభుత్వానికే తెలియనంత..! అవును వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం..!

Updated : 21 Jan 2023 05:54 IST

కోర్టు ఆదేశాలతో వివరాల సేకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో సలహాదారుల్ని ఎంత ఎడా పెడా నియమించిదంటే... ఎంత మంది సలహాదారులు ఉన్నారో ప్రభుత్వానికే తెలియనంత..! అవును వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం..! సలహాదారులు ఎంత మంది ఉన్నారో నివేదిక సమర్పించమని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఇప్పుడు తీరిగ్గా ఆ లెక్కలు తీస్తోంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న సలహాదారుల వివరాలు సేకరిస్తోంది. సలహాదారుల పేర్లు, హోదా, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? వారికి ఎంత వేతనం చెల్లిస్తున్నారు? వంటి వివరాలన్నీ క్రోడీకరించి పంపాల్సిందిగా వివిధ శాఖల ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఒక ప్రొఫార్మాతో కూడిన సర్క్యులర్‌ పంపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని