Annavaram: సత్యదేవుని వ్రతానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని వ్రతం, నిత్య కల్యాణం, ఇతర పూజలకు భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనాలనే నిబంధనను మంగళవారం నుంచి అమలు చేస్తున్నారు.
అన్నవరం, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని వ్రతం, నిత్య కల్యాణం, ఇతర పూజలకు భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనాలనే నిబంధనను మంగళవారం నుంచి అమలు చేస్తున్నారు. 2019 జులైలోనే దీనిని అమల్లోకి తెచ్చినా అధికారులు పట్టించుకోవడం మానేశారు. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఇన్‌ఛార్జి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశాలిచ్చారు. వ్రతం, ఇతర పూజల్లో పాల్గొనేందుకు పురుషులు పంచె, కండువా, లేదా కుర్తా, పైజమా, మహిళలు చీర లేదా కుర్తా, పైజమా తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
చంద్రబాబు గొప్ప నాయకుడు.. భాజపా పెద్దల్ని ఎందుకు కలిశారో ఆయన్నే అడగండి: సోము వీర్రాజు
-
Sports News
WTC Final: భారత్ ఈ రోజు పుంజుకోకుంటే..
-
Crime News
Kakinada: ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురి మృతి
-
India News
Padmini Dian: పొలం పనుల్లో మహిళా ఎమ్మెల్యే
-
Crime News
Couple Suicide: కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా