అరటి గెల ఆరున్నర అడుగులు

డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన అరటి తోటలో బూడిద బక్కీస్‌ రకం గెల ఆరున్నర అడుగులకు పైగా పెరిగింది.

Published : 25 Mar 2023 03:26 IST

న్యూస్‌టుడే, ఆత్రేయపురం: డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన అరటి తోటలో బూడిద బక్కీస్‌ రకం గెల ఆరున్నర అడుగులకు పైగా పెరిగింది. ఏకంగా 400 వరకు పండ్లతో అబ్బురపరుస్తోంది. సాధారణంగా 5 అడుగుల గెల వేసి, దానికి 300 వరకు పండ్లు ఉంటాయి. ఈ రకాన్ని తమిళనాడులో అమృతపాణి, కర్ణాటకలో కన్నడ చక్రకేళి, శ్రీకాకుళంలో సపోటా పేర్లతో పిలుస్తుంటారని రైతు తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగం, సారవంతమైన నేల కావడంతో ఇలా పెద్ద గెల వేసి ఎక్కువ కాయలు అరుదుగా వస్తుంటాయని ఉద్యాన అధికారిణి ఎం.అనూష చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని