Published : 16 Jan 2022 21:43 IST

ATF Price hike: జనవరిలో రెండోసారి పెరిగిన విమాన ఇంధన ధరలు

దిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నందున విమాన ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరను 4.2 శాతం పెంచినట్లు ఆదివారం చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం గత 72 రోజులుగా ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం.

విమానాల ఇంధన ధర దిల్లీలో కిలోలీటర్‌కు రూ.3,232.87 పెరిగి, రూ.79,294.91కి చేరింది. జనవరి 1నే ఏటీఎఫ్‌ ధరను 2.75 శాతం అంటే కిలోలీటర్‌కు రూ.2,039.63 పెంచారు. నవంబరు 2021 మధ్యలో ఏటీఎఫ్‌ ధరలు కిలోలీటర్‌కు రూ.80,835.04 వద్ద గరిష్ఠానికి చేరాయి. దీంతో డిసెంబరు 1, 15న రెండు దఫాల్లో 8.4 శాతం మేర ధరల్ని తగ్గించారు. దీంతో డిసెంబరు చివరికి కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర గరిష్ఠం నుంచి రూ.6,812.25 తగ్గింది. కానీ, తిరిగి జనవరిలో ధరలను పెంచుతుండడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర నవంబరు 5, 2021న 82.74 డాలర్లకు చేరింది. అనంతరం డిసెంబరు 1 నాటికి 68.87 డాలర్లు పడిపోయింది. దీంతో చమురు మార్కెటింగ్‌ సంస్థలు డిసెంబరులో ఏటీఎఫ్‌ ధరల్ని తగ్గించాయి. తర్వాత ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 85 డాలర్ల వద్ద ఉంది. దీంతో ఏటీఎఫ్‌ ధరల్ని సంస్థలు మళ్లీ పెంచుతున్నాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్