MNP ఇబ్బందులకు చెక్‌.. టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశాలు!

మొబైల్‌ వినియోగదార్లు తమ నెంబరు మార్చుకోకుండా, ఒక నెట్‌వర్క్‌ సంస్థ నుంచి మరొక నెట్‌వర్క్‌ సంస్థకు మారేందుకు మొబైల్‌నెంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) సదుపాయం ఉంది.

Updated : 08 Dec 2021 16:08 IST

దిల్లీ: మొబైల్‌ వినియోగదార్లు తమ నెంబరు మార్చుకోకుండా, ఒక నెట్‌వర్క్‌ సంస్థ నుంచి మరొక నెట్‌వర్క్‌ సంస్థకు మారేందుకు మొబైల్‌నెంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) సదుపాయం ఉంది. ఇందుకోసం 1900 నంబరుకు ఎస్‌ఎంఎస్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల చేసిన టారిఫ్‌ మార్పుల్లో భాగంగా, కొన్ని టెలికాం సంస్థలు నెలవారీ ప్రీపెయిడ్‌ ప్రాథమిక పథకాల్లో ఎస్‌ఎంఎస్‌ సదుపాయాన్ని నిలిపి వేశాయి. ఇందువల్ల పోర్ట్‌అవుట్‌ కోసం ఎస్‌ఎంస్‌ పంపలేకపోతున్నారు. ఎంఎన్‌పీకి ఎస్‌ఎంఎస్‌ పంపుకునే అవకాశం ప్రతి ఖాతాదారుకూ ఉండాలని, ఈ ఆదేశాలు సత్వరం అమల్లోకి వస్తున్నట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తెలిపింది. ఈ విషయంలో వొడాఫోన్‌ ఐడియాపై రిలయన్స్‌ జియో ఫిర్యాదు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని