GDP: 2021లో పెరిగిన ప్రభుత్వ వ్యయం!

గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం రెండు శాతం పెరిగినట్లు ‘మోతీలాల్‌ ఓస్వల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌)’ వెల్లడించింది. భారత వృద్ధిరేటు 7.3 శాతం కుంగినప్పటికీ.. వ్యయం మాత్రం పెరగడం విశేషమని అభిప్రాయపడింది.......

Updated : 03 Jul 2021 22:00 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం రెండు శాతం పెరిగినట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఎంఓఎఫ్‌ఎస్‌ఎల్‌) వెల్లడించింది. భారత వృద్ధిరేటు 7.3 శాతం కుంగినప్పటికీ.. ప్రభుత్వ వ్యయం మాత్రం పెరగడం విశేషమని అభిప్రాయపడింది. మరోవైపు ప్రైవేటు రంగ వ్యయం 10 శాతం తగ్గినట్లు వెల్లడించింది. దీంతో జీడీపీలో ప్రైవేటు రంగ వాటా 8.7 పర్సంటేజీ పాయింట్లు తగ్గగా.. ప్రభుత్వ వాటా 0.33 పర్సంటేజీ పాయింట్లు పెరిగినట్లు పేర్కొంది. ప్రభుత్వ పెట్టుబడులు వరుసగా రెండో ఏడాదీ తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. ఆర్థిక లోటు 13.3 శాతం తగ్గి మూడు దశాబ్దాల కనిష్ఠానికి చేరినట్లు వెల్లడించింది. ఇక గత నాలుగు సంవత్సరాల్లో మూడు సార్లు 6.3 శాతం చొప్పున కుంగిన రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వ్యయాలు ఈసారి ఏకంగా 5.8 శాతం పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రాల ఆర్థిక లోటు 17 సంవత్సరాల కనిష్ఠానికి చేరినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని