Niti Aayog CEO: మహిళలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందాలి 

హైదరాబాద్‌: దేశంలోని ప్రతి మహిళకూ ఆర్థిక సేవలు అందేలా ప్రభుత్వ బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని

Published : 19 Aug 2021 13:55 IST

 నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని ప్రతి మహిళకూ ఆర్థిక సేవలు అందేలా ప్రభుత్వ బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై బ్యాంకులు దృష్టి పెట్టాలని సూచించారు. డిజిటల్‌ ఆవిష్కరణలను తీసుకొచ్చేటప్పుడు.. అందులో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని.. వారు సులభంగా వాటిని ఉపయోగించుకునేలా ఉండాలని తెలిపారు. బుధవారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), ఉమెన్స్‌ వరల్డ్‌ బ్యాంకింగ్‌ సంస్థ కలిసి ఉమ్మడిగా ‘ద పవర్‌ ఆఫ్‌ జన్‌ధన్‌: మేకింగ్‌ ఫైనాన్స్‌ వర్క్‌ ఫర్‌ వుమెన్‌ ఇన్‌ ఇండియా’ నివేదికను విడుదల చేశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దృశ్యమాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్‌ ధన్, ఆధార్, మొబైల్‌ (జామ్‌) కలవడంతో, దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరంగా ఉన్న 40 కోట్ల మందీ ఆర్థిక సేవలు అందుకుంటున్నారని పేర్కొన్నారు. 10 కోట్ల మంది స్వల్ప ఆదాయం ఉన్న మహిళలకు ఆర్థిక సేవలను అందించడం ద్వారా రూ.25,000 కోట్ల డిపాజిట్లు బ్యాంకులకు లభిస్తాయని నివేదిక అంచనా వేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని