Hero Electric-Mahindra: మహీంద్రా ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారీ 

ప్రముఖ వాహన తయారీ సంస్థలు హీరో ఎలక్ట్రిక్‌, మహీంద్రా గ్రూప్.. విద్యుత్తు వాహనాల తయారీ కోసం చేతులు కలిపాయి.....

Updated : 19 Jan 2022 18:41 IST

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థలు హీరో ఎలక్ట్రిక్‌ (Hero Electric), మహీంద్రా గ్రూప్ (Mahindra Group).. విద్యుత్తు వాహనాల (EV) తయారీ కోసం చేతులు కలిపాయి. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకొన్నాయి.

ఈ ఒప్పందంలో భాగంగా మహీంద్రా గ్రూప్‌ తయారీ కేంద్రంలో హీరో ఎలక్ట్రిక్‌ బైక్‌లు తయారు కానున్నాయి. మధ్యప్రదేశ్‌లోని పీథంపూర్‌లో ఉన్న మహీంద్రా ప్లాంట్‌లో హీరో ఎలక్ట్రిక్‌కు చెందిన ఆప్టిమా, ఎన్‌వైఎక్స్‌ బైక్‌లు తయారు కానున్నాయి. మార్కెట్‌లో ఈవీలకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరు సంస్థలు ప్రకటించాయి.

దీంతో 2022  పూర్తయ్యే నాటికి ఏటా 1 మిలియన్ విద్యుత్తు వాహనాల తయారీ సామర్థ్యాన్ని అందుకోవాలన్న తమ లక్ష్యం నెరవేరనుందని హీరో ఎలక్ట్రిక్‌ ప్రకటించింది. లుథియానాలోని తమ తయారీ కేంద్రం సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని