వరుసగా నాలుగో రోజూ పెట్రో మంట!

దేశంలో పెట్రో ధరలు వరుసగా నాలుగోరోజు ఎగబాకి తాజా గరిష్ఠాలకు చేరాయి. చమురు సంస్థలు పెట్రోల్‌ పై 29 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని...

Updated : 12 Feb 2021 11:54 IST

దిల్లీ: దేశంలో పెట్రో ధరలు వరుసగా నాలుగోరోజు ఎగబాకి తాజా గరిష్ఠాలకు చేరాయి. చమురు సంస్థలు పెట్రోల్‌ పై 29 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.14కు, డీజిల్‌ ధర రూ. 78.38కు ఎగబాకింది. 

హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎగబాకాయి. నగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర శుక్రవారం రూ. 91.65కు చేరింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 85.50గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.64కు చేరగా.. డీజిల్‌ ధర రూ. 85.32గా ఉంది. 

2017, జూన్‌ 15 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఆధారంగా రోజు వారీ ధరల్లో హెచ్చుతగ్గులను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రతి వారంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ధరలను పెంచుతోంది. మిగిలిన రెండు, మూడు రోజులు ధరల పెరుగుదలలో మార్పు ఉండటం లేదు.

ఇతర ప్రధాన నగరాల్లో లీటర్‌ ధర ఇలా..

నగరం        పెట్రోల్‌(రూ.లలో)     డీజిల్‌‌(రూ.లలో)

చెన్నై              90.44          83.52
బెంగళూరు         91.09          83.09
కోల్‌కతా            89.44          81.96
లఖ్‌నవూ           87.07          78.84
జైపుర్‌              94.81          86.89

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని