అమెజాన్‌- ఫ్యూచర్‌ వివాదంపై విచారణ పూర్తి

రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ది సింగపూర్‌ ఇంటర్నేషనల్‌

Updated : 17 Jul 2021 05:48 IST

దిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌తో ఫ్యూచర్‌ గ్రూప్‌ కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ది సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ) శుక్రవారం పూర్తి చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఈ అంశంపై తుది విచారణను ఎస్‌ఐఏసీ ఈ నెల 12న ప్రారంభించింది. అయిదు రోజుల తుది విచారణను ఎస్‌ఐఏసీలో మధ్యవర్తిత్వ ప్రక్రియ కోసం ఏర్పాటైన ట్రైబ్యునల్‌ పూర్తి చేసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ హరీశ్‌ సాల్వే, అమెజాన్‌ తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ గోపాల్‌ సుబ్రమణియమ్‌ వాదించారు. నెల రోజుల తర్వాత తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని సమాచారం.


ఓయోకు రూ.5000 కోట్ల నిధులు

దిల్లీ: అంతర్జాతీయ సంస్థాగత పెట్టుబడిదార్ల నుంచి 660 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4920 కోట్ల) టర్మ్‌లోన్‌ బి నిధులు అందినట్లు ఆతిథ్య సంస్థ ఓయో తెలిపింది. పాత అప్పులు తీర్చేందుకు, ఇతర వ్యాపార అవసరాలకు ఈ నిధులు వినియోగిస్తామని పేర్కొంది. తమ వ్యాపార వ్యూహాలు, అమలు సన్నద్ధతపై పెట్టుబడిదార్లకు ఉన్న నమ్మకం వల్లే ఈ నిధులు అందినట్లు సంస్థ తెలిపింది. లాభాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని