బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ అర్ధం చేసుకోవడం సులభమే!!

బ్యాంకు స్టేట్‌మెంట్‌ను క్రమంతప్పకుండా క్షుణ్ణంగా పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. అసలు స్టేట్‌మెంట్‌లో ఏమి ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Published : 15 Dec 2020 18:39 IST

ఈ రోజుల్లో ఖర్చు చేసేందుకు నగదు ఉపయోగించడం తక్కువైపోయింది. పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌లో డెబిట్‌కార్డు స్వైపింగ్‌ ద్వారా కొనుగోళ్లు పెరిగాయి. ఖాతాలో సొమ్ము దేనికి ఎంత ఖర్చవుతుందో అవగాహన ఉండట్లేదు. ఎవరికైనా డబ్బు పంపాలన్నా ఆన్‌లైన్‌ లావాదేవీలను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకులు నెలవారీ స్టేట్‌మెంట్స్‌ను మెయిల్‌కు పంపుతూ ఉంటాయి. మెయిల్స్‌ తరచూ చూసేందుకు తీరిక ఉండటం లేదు. ఏదో హడావిడిలో తెరిచి మూసి వేస్తూ ఉంటాం. ఈ తొందరలో బ్యాంక్‌ స్టేట్‌మెంట్స్‌ డౌన్‌లోడ్‌ చేసినా దాన్ని తీరిగ్గా చూడం. ఒక్కోసారి కొన్ని విషయాలు గుర్తు ఉండకపోవడం వల్ల దేనికి ఖర్చు చేశామో తేల్చుకోలేక తికమక పడుతూ ఉంటాం.

డిపాజిట్‌, విత్‌డ్రాలతో పాటు ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, కార్డు చెల్లింపులు, చెక్కు ద్వారా చేసే చెల్లింపులు ఇతర రుసుములు వంటి వివరాలన్నింటినీ స్టేట్‌మెంట్‌లో పొందుపరుస్తారు. బ్యాంకు సేవలు వినియోగించుకున్నందుకు చేసే చిన్న చెల్లింపు వివరాలు సైతం మనం తెలుసుకునే వీలుంది. ఇందుకోసం స్టేట్‌మెంట్‌ను క్రమంతప్పకుండా క్షుణ్ణంగా పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. స్థూలంగా చూస్తే డిపాజిట్‌, విత్‌ డ్రాలకు సంబంధించిన వివరాలే కనిపించినప్పటికీ స్టేట్‌మెంట్‌లో అన్ని విషయాలు ఉంటాయి. అసలు స్టేట్‌మెంట్‌లో ఏమి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కస్టమర్‌ ఐడీ, ఖాతా సంఖ్య

ప్రతి ఖాతా సంఖ్యకు ఒక కస్టమర్‌ ఐడీని బ్యాంకు కేటాయిస్తుంది. స్టేట్‌మెంట్‌లో పైన ఈ ఐడీ నంబరు ఉంటుంది. దాని తర్వాత ఖాతా సంఖ్య ఉంటుంది.

అకౌంట్‌ వివరాల్లో

ఖాతా రకం(పొదుపు ఖాతా లేదా కరెంట్‌ ఖాతా) , ఖాతాలోని నగదు వంటి వివరాలు ఉంటాయి.

నామినేషన్‌

ఖాతాకు నామినీ ఉన్నారు అన్న విషయాన్ని తెలియపరుస్తారు. నామినీ పేరు స్టేట్‌మెంట్‌లో ఉండొచ్చు/ఉండకపోవచ్చు.

స్టేట్‌మెంట్‌లో వాడే పదాలు

BANK-STMNT-MODEL.jpg

VAT/MAT/NFS/ATM/ATW/ATS/NWB : ఏటీఎమ్‌ల నుంచి డబ్బు తీసిన వాటికి సంబంధించినవి

e-pay : ఎలక్ట్రానిక్ చెల్లింపులు

INF/ IINIL : ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చేసిన చెల్లింపులు

EBA : స్టాక్‌ మార్కెట్‌కు చెందిన లావాదేవీలు

NEFT : ఆన్‌లైన్‌ ద్వారా ఇతర ఖాతాలకు చేసిన లావాదేవీలు

POS : పాయింట్ ఆఫ్ సేల్ అంటే, దుకాణాలలో స్వయిప్ మెషిన్ ద్వారా చేసిన చెల్లింపులు

VPSPS : డెబిట్‌ కార్డు/క్రెడిట్‌ కార్డు ద్వారా చేసిన లావాదేవీలు

RTGS : ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆర్‌టీజీఎస్‌ పద్ధతిలో చేసే లావాదేవీలు

MOB/TOP : మొబైల్‌ రీఛార్జీలకు చేసే చెల్లింపులు

MMT : మొబైల్‌ ద్వారా జరిపిన ఆన్‌లైన్‌ లావాదేవీలు

స్టేట్‌మెంట్‌లో వాడే పదాల పూర్తి రూపాన్ని స్టేట్‌మెంట్‌ కింద చివర్లో ఇస్తూ ఉంటారు. దాని ఆధారంగా ఒకటి రెండు సార్లు స్టేట్‌మెంట్‌ను చదివితే పూర్తిగా అర్థమవుతుంది. ఏదైనా లావాదేవీ గురించి అర్థం అవ్వకపోతే, సంబంధిత బ్యాంకు శాఖను గానీ లేదా వినియోగదారుల సేవా ప్రతినిధిని ఫోన్లో లేదా ఆన్‌లైన్‌లో సంప్రదించి అడిగి తెలుసుకోవచ్చు.
మనం చేసే ఖర్చులపైన అవగాహన, నియంత్రణ ఉండాలంటే స్టేట్‌మెంట్‌ను చదవడం ముఖ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని