Facebook: గంటల వ్యవధిలో రూ.52 వేల కోట్లు హాంఫట్‌!

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.5.21 లక్షల కోట్లు) తరిగిపోయింది....

Updated : 07 Dec 2021 14:07 IST

సామాజిక మాధ్యమాలు స్తంభించడంతో తగ్గిపోయిన జుకర్‌బర్గ్‌ సంపద

దిల్లీ: సోమవారం సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.52 వేల కోట్లు) తరిగిపోయింది. దీంతో ఆయన బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితాలో మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 122 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

ఫేస్‌బుక్‌లో సమస్యలు తలెత్తాయన్న వార్తలు బయటకు తెలియగానే సంస్థ షేర్లు 5శాతం మేర పడిపోయాయి. దీంతో గతనెల మధ్య నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్ల విలువలో 15 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే నిన్న అనేక కంపెనీలు ఫేస్‌బుక్‌ నుంచి తమ ప్రకటనలను తొలగించాయి. ఈ నేపథ్యంలోనే జుకర్‌బర్గ్‌ సంపద తగ్గిపోయింది.

ఈ సామాజిక మాధ్యమాలు సోమవారం రాత్రి 9 గంటల నుంచి స్తంభించిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కొన్ని కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక.. గంటల తరబడి నానా హైరానా పడ్డారు. కొందరు ప్రత్యామ్నాయ సామాజిక మాధ్యమాల వైపు దృష్టిసారించారు. దాంతో వాటికి ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ఈ హఠాత్‌ పరిణామంపై ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చింది. సాంకేతిక కారణాలతో సేవలు నిలిచిపోయాయని, పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ప్రకటించింది. అంతరాయంపై జుకర్‌బర్గ్‌ స్వయంగా క్షమాపణలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని