BMW X4: మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ కొత్త ఎక్స్‌4.. ధరెంతో తెలుసా?

జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎక్స్‌4 కొత్త వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది......

Published : 10 Mar 2022 23:02 IST

దిల్లీ: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎక్స్‌4 కొత్త వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.70.5 లక్షలు(ఎక్స్‌షోరూం). దీంట్లో డీజిల్‌ ట్రిమ్‌ ధరను రూ.72.5 లక్షలుగా నిర్ణయించారు. దీన్ని చెన్నైలో ఉన్న తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌లలో పెట్రోల్‌, డీజిల్‌ ట్రిమ్‌లు అందుబాటులో ఉంటాయి. గత వెర్షన్‌తో పోలిస్తే.. డిజైన్‌, ఎక్విప్‌మెంట్‌, ఫీచర్ల విషయంలో అత్యాధునిక మార్పులు చేసినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేకంగా బ్లాక్‌ షాడో ఎడిషన్‌ను కూడా విడుదల చేశారు. ఇవి పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండనున్నాయి. 3-లీటర్‌ డీజిల్‌ కలిగిన ఎక్స్‌4 కారు 265 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 5.8 సెకన్లలోనే 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. ఇక 2-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 252 హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6.6 సెకన్లలో 0-100 కి.మీ/గం వేగాన్ని చేరుకుంటుంది.


స్క్రాంబ్లర్‌ 1100 ట్రిబ్యూట్‌ ప్రో @రూ.12.89 లక్షలు 

లగ్జరీ మోటార్‌సైకిల్‌ తయారీ సంస్థ డుకాటీ గురువారం స్క్రాంబ్లర్‌ 1100 ట్రిబ్యూట్‌ ప్రో అనే కొత్త బైక్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.12.89 లక్షలు (ఎక్స్‌షోరూం). ఐకానిక్‌ ఎయిర్‌కూల్డ్‌ ఎల్‌-ట్విన్‌ ఇంజిన్‌ విడుదలై 50 ఏళ్లు గడిచిన సందర్భంగా దానికి గుర్తుగా ఈ బైక్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. 1079 సీసీ సామర్థ్యం గల ఇంజిన్‌తో వస్తున్న ఈ బైక్‌ 86 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని