IndiGo: ఇద్దరు ఇండిగో పైలట్ల లైసెన్సులు సస్పెండ్‌ చేసిన డీజీసీఏ

IndiGo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదానికి కారణమైన ఇద్దరు పైలట్ల లైసెన్సులను డీజీసీఏ సస్పెండ్‌ చేసింది. భద్రతా పరమైన నిబంధనల ఉల్లంఘనే ఇందుకు కారణమని తెలిపింది.

Published : 26 Jul 2023 16:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఇద్దరు పైలట్ల లైసెన్సులను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) సస్పెండ్‌ చేసింది. గత నెలలో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమాన ల్యాండింగ్ సమయంలో తోక భాగం నేలను తాకిన ఘటనలో వీరిద్దరిపై చర్యలు తీసుకుంది. భద్రతా పరమైన నిబంధనలు పాటించనందువల్లే ఈ  ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది.

కష్టాలు చుట్టుముట్టిన వేళ.. బైజూస్‌ రవీంద్రన్‌ కంటతడి!

జూన్ 15న బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ వెళుతున్న ఇండిగో విమానం తోక భాగం ల్యాండింగ్ సమయంలో రన్‌వేను తాకింది. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ చేపట్టింది. ఇందులో పైలట్లు ప్రామాణిక నిర్వహణ పద్ధతి (SOP)కి భిన్నంగా పైలట్లు ల్యాండింగ్‌ జరిపారని తేలింది. అలాగే ఇద్దరు పైలట్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వారు బదులు ఇచ్చిన అనంతరం చర్యలు చేపట్టింది. పైలెట్‌ లైసెన్స్‌ను 3 నెలలు, కో పైలెట్‌ లైసెన్స్‌ను నెల రోజుల పాటు సస్పెండ్‌ చేసినట్లు డీజీసీఏ ఉన్నతాధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని