యులిప్ ఛార్జీల‌తో రాబ‌డి త‌గ్గుతుందా?

యూనిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్‌) ఛార్జీలు పాల‌సీ రాబ‌డి మీద ప్ర‌భావం చూపుతాయి.​​​​​​...

Published : 19 Dec 2020 13:10 IST

యూనిట్ లింక్‌డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్‌) ఛార్జీలు పాల‌సీ రాబ‌డి మీద ప్ర‌భావం చూపుతాయి.​​​​​​​

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యూలిప్) తో సంబంధం ఉన్న ఛార్జీలు, పాలసీ నుంచి వచ్చే రాబడులపై ప్రభావం చూపగలవు. పాలసీ ద్వారా జనరేట్ అయ్యే మొత్తం రాబడులను యూలిప్ ఛార్జీలు ఎలా తగ్గిస్తాయనే విషయాన్ని కింద చూద్దాం. యూలిప్ నాలుగు ప్రధాన ఛార్జీలను కలిగి ఉంటుంది.

  1. ప్రీమియం అలొకేషన్‌ ఛార్జీలు

  2. పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ ఛార్జీలు

  3. ఫండ్‌ నిర్వహణ ఛార్జీలు

  4. మోర్టాలిటీ ఛార్జీలు

  5. ప్రీమియం అలొకేషన్‌ ఛార్జీలు
    యులిప్స్‌ పథకంలో ఫండ్‌ యూనిట్ల కేటాయింపు జరిపేందుకు వసూలు చేసే ఛార్జీలను ప్రీమియం అలొకేషన్‌ ఛార్జీలంటారు. ఛార్జీల‌ను పెట్టుబ‌డుల‌కు ముందు ప్రీమియం నుంచి తీసుకుంటారు.

  6. పాలసీ అడ్మినిస్ట్రేషన్‌ ఛార్జీలు
    ఎంచుకున్న పథకాన్ని ప్రతి నెలా నిర్వహించేందుకుగాను ఫీజు రూపంలో యూనిట్లలో కోత విధించడం ద్వారా ఈ ఛార్జీలను వసూలుచేస్తారు. పాలసీ కాలావధి మొత్తానికి ఈ ఛార్జీల్లో మార్పు ఉండదు. కొన్ని సందర్భాల్లో ముందస్తు సూచనతో ఆయా పథకాన్ని బట్టి స్వల్ప మొతాదులో ఛార్జీల పెరుగుదల ఉంటుంది.

  1. ఫండ్‌ నిర్వహణ ఛార్జీలు
    యులిప్స్‌లో ఉండే ఫండ్లను నిర్వహించేందుకు వసూలు చేసే ఛార్జీ ఇది. ఫండ్‌ నిర్వహణ కోసం ఛార్జీని కేటాయించాకే నికర ఆదాయ విలువ (ఎన్‌.ఏ.వి)ను లెక్కిస్తారు.

  2. మోర్టాలిటీ ఛార్జీలు
    యులిప్స్‌ పథకం ద్వారా బీమా రక్షణను కల్పించేందుకు ఈ ఛార్జీలు వసూలుచేస్తారు. ఈ ఛార్జీలు వ్యక్తి వయసు, ఆరోగ్య స్థితి, బీమా హామీ సొమ్మును బట్టి ఉంటుంది.

ఈ ఛార్జీలు పాల‌సీదారుడి వ‌య‌సు, బీమా సంస్థ‌ను బ‌ట్టి మారుతుంటాయి…

ఉదాహ‌ర‌ణ‌కు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ తీసుకుంటే,

  • మొద‌టి ఏడాది- 2.5 శాతం
  • రెండో ఏడాది - 2 శాతం
  • మూడో ఏడాది - సున్నా

కొన్ని ప్లాన్‌ల‌పై ఛార్జీలు అత్య‌ధికంగా ఉంటాయి. అయితే ప‌దేళ్ల త‌ర్వాత ఈ ఛార్జీలు ఉండ‌వు. వీటిని ప్ర‌తి నెల వ‌సూలు చేస్తారు. గ‌రిష్ఠంగా రూ.500 వ‌ర‌కు ఉంటాయి.

  • ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జ్ (వ్యయ నిష్ప‌త్తి) -1.35 శాతం
  • జీవిత బీమాపై మోర్టాలిటీ ఛార్జ్ ఎక్కువ‌గా ఉంటుంది.
  • వార్షిక మోర్టాలిటీ ఛార్జ్ =మోర్టాలిటీ రేటు *హామీ మొత్తం/1000

వ‌య‌సు ఆధారంగా మోర్టాలిటీ ఛార్జీలలో మార్పు ఉంటుంది. పిల్ల‌ల‌కి లేదా సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కి హామీ మొత్తం చెల్లిస్తే బీమా సంస్థకి రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది

రాబ‌డిపై ఛార్జీల ప్ర‌భావం

యులిప్ ప్రీమియం రూ.1000 అనుకుంటే ,

  • ఎన్ఏవి నుంచి రాబ‌డి 10 శాతం అయితే, మోర్టాలిటీ ఛార్జీలు రాబ‌డిపై ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసుకుందాం. 24 ఏళ్ల వ‌య‌సులో యులిప్‌లో పెట్టుబ‌డులు ప్రారంభించిన‌వారికి.

T1.jpg

పైన తెలిపిన వివ‌రాలు 24 ఏళ్ల వ‌య‌సులో యులిప్‌లో పెట్టుబ‌డులు ప్రారంభించిన‌వారికి. 34 ఏళ్ల వ‌య‌సులో ప్రారంభించిన‌వారికి మోర్టాలిటీ ఛార్జీల ప్ర‌భావం ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది.

T22.jpg

గ‌మ‌నిక: ఫండ్ మేనేజ్‌మెంట్ ఛార్జీలుగా తీసేయ‌గా వ‌చ్చిన దానిని ఎన్ఏవీ రాబ‌డి 10 శాతంగా లెక్కిస్తారు.

24 వ‌య‌సులో యులిప్ పెట్టుబ‌డులు ప్రారంభిస్తే పాల‌సీ అడ్మినిస్ర్టేష‌న్ ఛార్జీలు , రాబ‌డిపై ప్ర‌భావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం…

T3.jpg

ప్రీమియం అలొకేష‌న్ ఛార్జీలు పెట్టుబ‌డుల‌కు ముందే తీసుకున్న‌ప్ప‌టికీ, యులిప్ నుంచి వ‌చ్చిన అస‌లు రాబ‌డిని తెలుసుకునేందుకు ఇత‌ర పెట్టుబ‌డి సాధ‌నాలు మ్యూచువ‌ల్ ఫండ్లు వంటి వాటితో పోల్చి చూసుకోవాలి.

24 ఏళ్ల వ‌య‌సులో పాల‌సీ ప్రారంభిస్తే, ప్రీమియం ఏడాది అలొకేష‌న్ ఛార్జీలు తీసివేయ‌గా మిగిలిన ఎన్ఏవి, అస‌లు రాబ‌డి …

T4.jpg

జీఎస్‌టీతో రాబడి మ‌రో 0.5 శాతం తగ్గవచ్చు.

రాబ‌డిపై యులిప్ ఛార్జీల ప్ర‌భావంతో పాటు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌తో పోలిస్తే యులిప్ ఎన్ఏవి రాబ‌డి ఎందుకు త‌క్కువ‌గా ఉంటుందో వివ‌రంగా తెలిపేందుకు ఈ క‌థ‌నం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని