Disney+ Hotstar: ఇండియా vs పాక్‌ మ్యాచ్‌.. డిస్నీ+హాట్‌స్టార్‌ సరికొత్త రికార్డ్‌

Disney+ Hotstar: ఇండియా, పాకిస్థాన్‌ మధ్య సోమవారం జరిగిన ఆసియా కప్‌ మ్యాచ్‌ వ్యూస్‌లో డిస్నీ+హాట్‌స్టార్‌ సరికొత్త రికార్డ్‌ నమోదు చేసింది.

Published : 13 Sep 2023 02:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar)ఆసియా కప్‌ (Asia Cup 2023) ప్రసారాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. సోమవారం (సెప్టెంబరు 11) జరిగిన మ్యాచ్‌తో రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇండియా, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏకకాలంలో 28 మిలియన్ల (2.8 కోట్ల ) వీక్షణలను సొంతం చేసుకుంది. 2019లో జరిగిన ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో నమోదు చేసుకున్న 2.5 కోట్ల వ్యూస్‌ రికార్డును తానే తిరగరాసింది.

ఇండియా పాల్గొన్న క్రికెట్‌ మ్యాచుల్లో అత్యధిక డిజిటల్‌ వీక్షకుల సంఖ్య ఇదే అని బీసీసీఐ (BCCI) కార్యదర్శి జే షా (Jay Shah) తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఆసియా కప్‌, ఐసీసీ పురుషుల ప్రపంచ కప్‌ (World Cup) మ్యాచ్‌లను తమ వేదికపై ఉచితంగా వీక్షించటానికి డిస్నీ+ హాట్‌స్టార్‌ అవకాశం కల్పించింది. అయితే, మొబైల్‌ వీక్షకులకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో జియో సినిమా తన ఐపీఎల్‌ (IPL) టోర్నమెంట్ ప్రసారాలను ఉచితంగా అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ వీడియో మాధ్యమం అక్టోబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో గరిష్టంగా 61.3 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండేది. గత మూడు త్రైమాసికాల నుంచి దాదాపు 21 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీంతో  2023తో ముగిసే త్రైమాసికంలో చందాదారుల సంఖ్య 40.4 మిలియన్లకు పడిపోయింది.

ఎలాన్‌ మస్క్‌లో ‘అపరిచితుడు’.. బయోగ్రఫీ రచయిత

ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌ వ్యూస్‌ రికార్డుల విషయానికొస్తే.. ప్రస్తుతం జియో సినిమా (Jio Cinema) ఏకకాలంతో క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించే వారి సంఖ్యలో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ టోర్నమెంట్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మే 2023న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఏకకాలంలో 32 మిలియన్లకు పైగా వీక్షకులను సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు