హీరో విద్యుత్‌ స్కూటర్‌ విడా వి1

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌.. విద్యుత్‌ వాహన విభాగంలోకి అడుగు పెట్టింది. తన తొలి విద్యుత్‌ స్కూటర్‌ విడా వి1ను శుక్రవారం ఆవిష్కరించింది. ఇందులో రెండు వేరియంట్‌లను తీసుకొచ్చింది.

Published : 08 Oct 2022 02:35 IST

రూ.1.45 - 1.59 లక్షల శ్రేణిలో

చిత్తూరు ప్లాంటులో తయారీ

ఈనెల 10 నుంచి బుకింగ్‌

జయపుర: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌.. విద్యుత్‌ వాహన విభాగంలోకి అడుగు పెట్టింది. తన తొలి విద్యుత్‌ స్కూటర్‌ విడా వి1ను శుక్రవారం ఆవిష్కరించింది. ఇందులో రెండు వేరియంట్‌లను తీసుకొచ్చింది. వీటిని చిత్తూరులో ఉన్న కంపెనీ ప్లాంటులో తయారు చేస్తారు. ఏడాదిలోగా వీటిని ఎగుమతి చేయనుంది.

* విడా వి1 ప్లస్‌ ధర రూ.1.45 లక్షలు కాగా, విడా వి1 ప్రోధర రూ.1.59 లక్షలు (ఎక్స్‌ షోరూం).

* ఒక్క ఛార్జింగ్‌తో విడా వి1 ప్లస్‌ 143 కి.మీ,. విడా వి1 ప్రో 165 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. రిమూవబుల్‌ బ్యాటరీని ఈ స్కూటర్‌కు అమర్చుతున్నారు. అయిదేళ్లలో 50,000 కి.మీ వరకు వారంటీ ఉంది.

* బెంగళూరు, దిల్లీ, జయపురలలో తొలుత విక్రయాలను మొదలుపెట్టి.. డిసెంబరులోగా మరో 8 నగరాలకు విస్తరించనుంది.

* బుకింగ్‌లు అక్టోబరు 10న ప్రారంభమవుతాయి. డిసెంబరు రెండో వారం నుంచి డెలివరీలు చేస్తారు.

తిరిగి కొనుగోలుకు హామీ: ఈ విద్యుత్తు స్కూటర్లకు తిరిగి కొనుగోలు హామీ పథకాన్ని సంస్థ తీసుకొస్తోంది. స్కూటర్‌ యజమానులు 16-18 నెలల మధ్య తిరిగి ఇచ్చేస్తే, వాహన కొనుగోలు ధరలో 70% ఇచ్చే పథకాన్నీ ప్రవేశ పెడుతోంది.  విద్యుత్‌ స్కూటర్‌లలో పెను మార్పునకు విడా వి1  కారణం అవుతుందని హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌, సీఈఓ పవన్‌ ముంజాల్‌ పేర్కొన్నారు. అందుబాటు ధర మోడళ్లు కూడా ఆవిష్కరిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని