ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్‌

దివీస్‌ లేబొరేటరీస్‌ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్‌ లేబొరేటరీస్‌ గురువారం వెల్లడించింది.

Updated : 26 Apr 2024 02:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: దివీస్‌ లేబొరేటరీస్‌ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్‌ లేబొరేటరీస్‌ గురువారం వెల్లడించింది. పూర్తిగా సొంత నిధులను దీని కోసం కేటాయించనున్నట్లు వివరించింది. ఈ కొత్త సదుపాయం 2027 జనవరికి అందుబాటులోకి వస్తుంది. రెండు సంస్థల మధ్య వ్యాపార ఒప్పందానికి అనుగుణంగా, ఆ ఔషధ కంపెనీ పేరు, ఇతర వివరాలు వెల్లడించలేకపోతున్నట్లు దివీస్‌ ల్యాబ్స్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని