న్యూట్రాస్యూటికల్‌ ఉత్పత్తుల కోసం డాక్టర్‌ రెడ్డీస్‌, నెస్లే సంయుక్త సంస్థ

న్యూట్రాస్యూటికల్‌ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ చేతులు కలిపాయి.

Published : 26 Apr 2024 02:24 IST

హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు 

ఈనాడు, హైదరాబాద్‌: న్యూట్రాస్యూటికల్‌ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌ చేతులు కలిపాయి. ఇందుకోసమే ఈ రెండు కంపెనీలు కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ గురువారం ఇక్కడ వెల్లడించింది. ఈ సంయుక్త సంస్థ 6 నెలల వ్యవధిలో హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెడుతుంది. ఈ రెండు కంపెనీలు తమ వద్ద ఉన్న విటమిన్లు, పోషకాలు, హెర్బల్‌ ఉత్పత్తులు, సంప్లిమెంట్ల ఉత్పత్తుల లైసెన్సును కొత్త కంపెనీకి ఇస్తాయి. ప్రధానంగా ఇవి మెటాబోలిక్‌, హాస్పిటల్‌ న్యూట్రిషన్‌, సాధారణ ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉత్పత్తులు, బ్రాండ్లు కావడం గమనార్హం.

  •  నెస్లే గ్రూపు తన ప్రముఖ బ్రాండ్లు అయిన- నేచుర్స్‌ బౌంటీ, ఒస్టెయో బై-ఫ్లెక్స్‌, ఈస్తర్‌-సి, రిసోర్స్‌ హై ప్రొటీన్‌, ఆప్టిఫాస్ట్‌, రిసోర్స్‌ డయాబెటిక్‌, పెప్టామెన్‌, రిసోర్స్‌ రీనల్‌, రిసోర్స్‌ డయాలసిస్‌ బ్రాండ్లను సంయుక్త కంపెనీకి ఇస్తుంది.
  •  డాక్టర్‌ రెడ్డీస్‌ బ్రాండ్లు అయిన రీబాలెన్స్‌, సెలెవిదా, ఆంటాక్సిడ్‌, కిడ్‌రిచ్‌-డీ3, బికోజింక్‌, మరికొన్ని ఓటీసీ (ఓవర్‌ ద కౌంటర్‌) ఉత్పత్తులను సంయుక్త సంస్థకు బదిలీ చేస్తుంది. నాణ్యమైన న్యూట్రిషన్‌ ఉత్పత్తులను వినియోగదార్లకు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకే డాక్టర్‌ రెడ్డీస్‌తో కలిసినట్లు నెస్లే ఇండియా సీఎండీ సురేష్‌ నారాయణన్‌ వివరించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు