కేంద్రానికి ఓఎన్‌జీసీ రూ.5,001 కోట్ల డివిడెండు

ఓఎన్‌జీసీ నుంచి ప్రభుత్వ ఖజానాకు తాజాగా రూ.5,001 కోట్ల డివిడెండు లభించింది.

Published : 29 Nov 2022 01:42 IST

దిల్లీ: ఓఎన్‌జీసీ నుంచి ప్రభుత్వ ఖజానాకు తాజాగా రూ.5,001 కోట్ల డివిడెండు లభించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌ఈలు) నుంచి ప్రభుత్వానికి మొత్తం రూ.23,797 కోట్ల డివిడెండు వచ్చింది. సీపీఎస్‌ఈలు స్థిరమైన డివిడెండ్‌ విధానంతో ముందుకు వచ్చి అధిక డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించాలని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) 2020లో సూచించిన సంగతి విదితమే. లాభదాయకత, మూలధన వ్యయ అవసరాలు, నగదు/నిల్వలు, నికర విలువ తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని డివిడెండ్‌ను చెల్లించాలని కోరింది. దీపమ్‌ మార్గదర్శకాల ప్రకారం, సీపీఎస్‌ఈలు కనీసం వార్షిక డివిడెండుగా నికర లాభంలో 30 శాతం లేదా నికర విలువలో 5 శాతం.. వీటిలో ఏది ఎక్కువైతే అది చెల్లించాల్సి ఉంది. ఓఎన్‌జీసీ నుంచి రూ.5,001 కోట్ల డివిడెండ్‌ అందుకున్నట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం డివిడెండ్‌ రూ.23,797 కోట్లకు చేరినట్లు దీపమ్‌ వెబ్‌సైట్‌ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని